MP vs Ex Minister: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా మచిలీపట్నంలో నాయకుల మధ్య అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. అధికారిక కార్యక్రమానికి పేర్ని నాని డుమ్మాకొట్ట.. సీఎం జగన్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు.. సీఎం వరకు పంచాయతీ వెళ్లింది కూడా.. ఎందుకంటే ఉమ్మడి కృష్నాజిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని ఎంపీ బాల శౌరి ఇద్దరు కూడా.. సీఎం జగన్ కు అత్యంత ఆప్తులు.. వీరి మధ్య 2019 ఎన్నికల సమయంలో బాగానే కలివిడి ఉంది. కానీ తర్వాత మాత్రం వివాదాలు ప్రారంభమయ్యాయి. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు.. తనదే ఆధిపత్యం ప్రదర్శించారని.. ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు.
మంత్రిగా దిగిపోయిన తర్వాత ఎంపీ పెత్తనం చేస్తున్నారని నాని అంటున్నారు. ఇలా మొదలైన వివాదం ఇప్పుడు పోర్టు వరకు పాకింది. గత ఎన్నికల్లో ఈ పోర్టు నిర్మాణంపైనే వీరు రాజకీయ హామీ ఇచ్చి ఇద్దరూ ఇక్కడ విజయం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా మరోసారి ఎంపీ బాలశౌరి–ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మచిలీపట్నంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొత్తగా స్పందన సమావేశం మందిరం ఏర్పాటు చేశారు. ఈ అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యే పేర్ని నాని డుమ్మా కొట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ బాలశౌరి. ఎంపీ లాడ్స్ నుంచి సమావేశం మందిర నిర్మాణానికి 15 లక్షలు ఇచ్చారు ఎంపీ బాలశౌరి.
ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే నాని. అయితే పోలీసుల నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికలో సైతం పేర్ని నానికి ప్రాధాన్యత దక్కలేదు. ప్రత్యేక అతిధుల జాబితాలో నగర మేయర్, ఏడుగురు జిల్లా శాసనమండలి సభ్యుల తర్వాత పేర్ని నాని పేరు ఉంది. దీంతో కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై జేసీ, పౌరసరఫరాల శాఖ అధికారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పేర్ని నాని. మరోవైపు ఎంపీ తీరుపై పేర్ని నాని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలో పేర్లు వేశామంటున్నాయి పోలీసు వర్గాలు. అయితే పేర్ని నాని మాత్రం తనకు అన్యాయం జరిగింది అంటూ.. కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.. సీఎంకు అంత్యంత ఆప్తుడైన పేర్ని నాని.. అధికారిక కార్యక్రమానికి హాజరు కాకపోవడం అధిష్టానానికి షాక్ లాంటింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Perni nani, Ycp