Ex minster anil kumar yadav Vs Minster Kakani Govardhan Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడు ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలు, సమావేశాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీలో వర్గ పోరాటాలు పెరుగుతున్నాయి. ముఖ్యం అధికారపార్టీలో కొత్త కేబినెట్ చిచ్చు పెడుతోంది. ఇంతరకు ఇంటర్నల్ గా ఉన్న రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 11 మందిని పాత వారిని కొనసాగించి తమకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన.. మరోవైపు తమ వ్యతిరేక వర్గానికి మంత్రి పదవి దక్కిందనే ఆక్రోషం మరోవైపు.. దీంతో నేతల మధ్యూ దూరం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో జిల్లా (Nellore District) వైఎస్సార్సీపీ (YSRCP) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రివర్గ విస్తరణతో ఆ పార్టీలో అంతర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా కొత్తగా మంత్రి ఎన్నికైన కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)తో అనిల్ కుమార్ యాదవ్ కు (Anil Kumar Yadav) మధ్య వార్ పీక్ కు చేరింది. ఇద్దరూ ఇవాళే బహిరంగ సభలతో బల ప్రదర్శనకు సై అంటే సై అంటున్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షించుకుంటూ.. సభ భారీ సక్సెస్ కావాలి అంటూ కేడర్ కు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే సభను తాను బల ప్రదర్శన కోసం నిర్వహించడం లేదని.. గతంలో సీఎం ఆదేశాల మేరకే గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టామని.. ఇప్పటికిప్పుడు షెడ్యూల్ మార్చే అవకాశం లేదని.. ఈ సభకు కేవలం తన నియోజకవర్గ నేతలు, అనుచరులు మ ాత్రమే వస్తారన్నారు. తాను సీఎం జగన్ సైనికుడని.. ఆయన కు వ్యతిరేకంగా ఏదీ చేయను అన్నారు.
ఇదీ చదవండి : మంత్రి-మాజీ మంత్రి మధ్య చిచ్చు.. జిల్లాకు వచ్చినా పలకరింపులు ల్లేవ్
అయితే ఇవాళ సాయంత్రమే మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి.. తొలిసారి మంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన నెల్లూరు చేరుకుని సభ నిర్వహించే సమయానికి అనిల్ కుమార్ సభ కూడా ఉంది. దీంతో ఇద్దరు కావాలనే ఒకే సమయానికి సమావేశాలు పెట్టుకున్నారని జిల్లా వైసీపీ నాయకులు టాక్. దీంతో మంత్రి సహకరించాలా..? మాజీ మంత్రికి సహకరించాలా..? ఒకరితో ముందుకెళ్తే మరొకరితో ప్రాబ్లమ్ వస్తుందని భయపడుతున్నారు. ఏదీ ఏమైనా నేటి సభలతో ఎవరి బలం ఎంత అని తేలిపోనుంది.
ఇదీ చదవండి : కేరళతో పోటీ పడుతున్న కొనసీమ.. తెరపైకి కొత్త టూరిస్ట్ స్పాట్లు.. ప్రత్యేకతలివే
ఇలా ఇద్దరు నేతలు వెనక్కు తగ్గకపోవడంతో.. నెల్లూరు రాజకీయ వ్యవహారాలపై అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. ఇద్దరు నేతలు సమన్వయంతో పని చేయాలని.. సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పాలని సూచించారు. ఇద్దరులో ఎవరు హద్దులు దాటి ప్రవర్తించిన.. కచ్చితంగా కఠిన ర్యలు తీకోక తప్పదని అధిష్టానం నుంచి వార్నింగ్ వచ్చినట్టు సమాచారం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP cabinet, Ap cm jagan, AP News, Ycp