Home /News /andhra-pradesh /

AP POLITICS YCP GENERAL SECRETARY SAJJALA RAMA KRISHNA REDDY MADE KEY COMMENTS ON ALLIANCE WITH CONGRESS AND PRASHANTH KISHORE FULL DETAILS HERE PRN GNT

YSRCP: పీకేతో రిలేషన్ లేదు.. కాంగ్రెస్ తో పొత్తు లేదు.. సజ్జల ఆసక్తికర కామెంట్స్..

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల బాగా చర్చనీయాంశమైన అంశం కాంగ్రెస్ తో వైసీపీ (YSRCP) పొత్తు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లీకవడంతో తీవ్ర చర్చ జరిగింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల బాగా చర్చనీయాంశమైన అంశం కాంగ్రెస్ తో వైసీపీ (YSRCP) పొత్తు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లీకవడంతో తీవ్ర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ కు పీకే సలహా ఇవ్వడంతో రెండు పార్టీలు కలుస్తున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే ఇటు వైసీపీ గానీ, అటు కాంగ్రెస్ గానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు, ప్రశాంత్ కిషోర్ సలహాలపై మరింత స్పష్టతనిచ్చారు.

    ప్రస్తుతం వైసీపీకి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సేవలు అందించడం లేదని సజ్జల చెప్పారు. పీకేకి సీఎం జగన్ తో పర్సనల్ గా ఫ్రెండ్ షిప్ ఉందని.. 2019 ఎన్నికల సందర్భంగా ఆయన తమతో కలిసిపనిచేశారని.. తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి డీలింగ్స్ లేవన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి భాగస్వామ్యం ఉండకపోవచ్చని సజ్జల చెప్పారు. ఇక కాంగ్రెస్ తో పొత్తు అంశంపైనా సజ్జల స్పందించారు. తమకు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న ఆయన.. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదన్నారు. ఒంటరిగానే పోటీ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతమని.. మాతో పొత్తుపెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చని.. కానీ జగన్ మాత్రం పొత్తుల్లేకుండానే పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

    ఇది చదవండి: రాసలీలల స్క్రిప్ట్ రెడీ.. హీరోయిన్లు వాళ్లే.. మంత్రులకు జనసేన ఓపెన్ ఆఫర్..


    రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ టీడీపీ పిలువునివ్వడం హాస్యాస్పదమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమ హయాంలో మహిళలకు ఎన్నడూలేని సాధికారత, భద్రత అందిస్తున్నామని.., సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళా భాగస్వామ్యం అత్యధికమన్నారు. టీడీపీ చేసే విమర్శలను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారాయన.

    ఇది చదవండి: ప్రశాంత్ నీల్ మన తెలుగోడే..! ఏపీ మాజీ మంత్రికి రిలేషన్ కూడా.. నీల్ అంటే అర్ధం ఇదే..!


    రేపు కీలక భేటీ..!
    ఇదిలా ఉంటే పార్టీ బలోపేతంపై సీఎం జగన్ దృష్టిపెట్టారు. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్ల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించిన సీఎం జగన్.. వారితో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 27న జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరవుతున్నారు. ఈ భేటీలో ఎన్నికల కార్యాచరణతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి..? అలాగే వచ్చేనెల నుంచి చేపట్టాల్సిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేసే అవకాశముంది. ఇందులో ఎలాంటి సీఎం జగన్ ఎలాంటి ఆదేశాలిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Prashant kishor, Sajjala ramakrishna reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు