Home /News /andhra-pradesh /

AP POLITICS YCP GENERAL SECRETARY SAJJALA RAMA KRISHNA REDDY AND MINISTER AMBATI RAMBABU SLAMS CHANDRABABU NAIDU FULL DETAILS HERE PRN

AP Politics: "మతి తప్పిన బాబు.., ఎంతలేపినా కష్టమే.." చంద్రబాబు బర్త్ డేనీ వదలని వైసీపీ..

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై వైసీపీ (YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

    టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పై వైసీపీ (YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బాబు కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూనే.. పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే బెటర్ అంటూ సలహాలిస్తున్నారు. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. టీడీపీ అధినేతపై మండిపట్టారు. చంద్రబాబుకు మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. ఆయన నోటికి అడ్డూఅదుపు లేకుండా కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. పుట్టినరోజు సందర్భంగా దుర్గమ్మను దర్శించుకొని తనకు తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు కావాలని కోరుకున్నారని.. అంటే ఇన్నాళ్లు బాబుకు మతి భ్రమించిందా అని ప్రశ్నించారు.

    తెలివితేటలు ప్రసాదించాలని దుర్గమ్మ అమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారని.., మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా? అని సజ్జల ప్రశ్నించారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయని.., కానీ చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. నిన్నటి నుంచి ఆయన మాటలే అందుకు నిదర్శనమని వివరించారు. చంద్రబాబు ఓ ఉన్మాదిలా మారి బరితెగించి వ్యవహరిస్తున్నాడరని.., ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

    ఇది చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. 2500 మందికి ఉద్యోగాలు


    పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలోనూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. అసలు ఆ పాపం చంద్రబాబుదేనని సజ్జల ఆరోపించారు. అయినా అదేపనిగా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఆనాడు రైతులను మోసం చేసిన చంద్రబాబు ఇవాళ రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలంటూ వాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతి తప్పిన చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉండాలా? అని సజ్జల ప్రశ్నించారు.

    ఇది చదవండి: ఏపీలో మరోసారి తెరపైకి సినిమా టికెట్ల ఇష్యూ.. ఆన్ లైన్ అమ్మకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


    ఇదిలా ఉంటే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు తెలివి ఇవ్వాలని తాను కూడా దుర్గమ్మను మొక్కుకుంటున్నానన్నారు. అంతేకాదు చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చొబెట్టేందుకు ఆయన అనుకూల మీడియా ఎంతలేపినా ఫలితం ఉండదంటూ సెటైర్లు వేశారు. అక్క ఆరాటమేగానీ బావ బ్రతకడంటూ సామెతలు కూడా చెప్పారు అంబటి. పోలవరాన్ని తమ హయాంలోనే పూర్తి చేసి తీరుతామన్న చంద్రబాబు.. డయా ఫ్రమ్ వాల్ విషయంలో ముమ్మాటికీ చంద్రబాబే దోషని మంత్రి ఆరోపించారు. పోలవరం విషయంలో ఎవరిది తప్పో అన్నీ రుజువు చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ambati rambabu, Andhra Pradesh, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు