YCP Trolls on KTR: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్లు బాగులేవు.. విద్యుత్ లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య పెను దుమారమే రేపింది. దీంతో మంత్రి కేటీఆర్ (Minster KTR) స్వయంగా వెనక్కు తగ్గారు. దీంతో వివాదం ముగిసింది అనుకున్నారు అంతా.. కానీ ఒక్కరోజు వర్షానికి హైదరాబాదీలు నరకయాతన అనుభవిస్తుండడంతో.. వైసీపీ అభిమానులు (YCP Followers) ఇప్పుడు కేటీఆర ను ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీ అభిమానుల కోపానికా కారణం ఏంటంటే.. ఇటీవల.. పండక్కి ఊరెళ్లి వచ్చాక తన క్లోజ్ ఫ్రెండ్ ఆంధ్రాలో పరిస్థితులు బాలేవని అక్కడ నీళ్లు, కరెంటు ఉండవని, రోడ్లు బాలేవని చెప్పారని మొన్న క్రెడాయ్ మీటింగ్ లో కేటీఆర్ గుర్తు చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు హైలైట్ చేశాయి. దీంతో కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఆ దెబ్బతో వైసీపీకి బాగానే డ్యామేజ్ అయ్యింది. మిత్రుడిగా చెప్పుకునే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేయడంతో.. ఏపీలో ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రం ఇచ్చినట్టు అయ్యింది. దీంతో మంత్రులు, మాజీ మంత్రులు అంతా కేటీఆర్ పై మాటల దాడి మొదలెట్టారు. వివాదాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేని కేటీఆర్.. తనది ఒక అమాయకపు వ్యాఖ్య అని ట్వీట్ చేశారు. అయినా వివాదం ఆగలేదు.. ఇప్పుడు వైసీపీ ఫాలోవర్స్ అంతా మంత్రి కేటీఆర్ ను ట్రోల్స్ చేస్తున్నారు...
కేటీఆర్ ట్రోల్స్ కు గురవ్వడానికి కారణం ఏంటంటే..? ఒక్కరోజు భారీగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం జలమయం అయ్యింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కేవలం హైదరాబాదే కాదు.. తెలంగాణ తిరుమల అని టీఆర్ఎస్ చెప్పుకుంటూ.. వేల కోట్ల రూపాయలతో డవెలప్ చేస్తున్న యాదాద్రి ఆలయానికి వెళ్లే దారులు కుంగిపోయాయి. ఈ రెండు అంశాలు వైసీపీ అభిమానులకు ఆయుధాల్లా మారాయి. దీంతో ఆంధ్రా రోడ్డు చూపించాలా అంటూ వైసీపీ ఫాలవర్స్.. కేటీఆర్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
KTR frnd enjoying in Hyderabad mini Swimming pools 😍pic.twitter.com/4Bfoaatvv7
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
మొన్న కేటీఆర్ చెప్పిన మాటలను సైతం కొందరు ట్యాగ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ పై రోట్ల పరిస్థితిపై మీమ్స్ పెడుతూ ట్రెండింగ్ ఆయ్యేలా రీ ట్వీట్లు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్లపైకి స్విమ్మింగ్ పూల్స్ వచ్చాయి అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. హాయ్ అన్నా మీ అన్నను అడిగాను అని చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు.
Velu kuda Andhra ni cmnt cheyatame 🤣🤣
Hi anna @KTRTRS me frnd ni adigaanu ani chepu https://t.co/26ABqN0Gag
— YS Jagan Trends™ (@YSJaganTrends) May 4, 2022
మొన్న ఆంధ్రాలో రోడ్లు బాగులేవని చెప్పిన మీ ఫ్రెండ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడా లేకా.. ఇక్కడ కూడా రోడ్లు బాగులేవని తిరిగి వెళ్లిపోయాడా జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..
Ante ippudu city lo current ledu ..roads kuda water vachi baledu kada unnada Vellada anii 😀#JustAsking #RainsInHyderabad #KTR pic.twitter.com/pYR8ShUCkR
— Samosa Times (@samosatimes7) May 4, 2022
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ ఎక్కువైంది. మరి దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో.. ఎందుకులే వివాదం అని వదిలేస్తారా..? లేద తెలంగాణలో విపక్షాల కన్నా ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్న.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా అన్నది చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Hyderabad Heavy Rains, KTR