Home /News /andhra-pradesh /

AP POLITICS YCP CHIEF JAGAN MOHAN REDDY KEY MEETING WITH PARTY LEADERS HE FOCUSED ON 2024 ELECTIONS NGS

CM Jagan Meeting: నేడు సీఎం జగన్ కీలక ప్రకటన.. సర్వే రిపోర్టు ముందు పెడతారా?

నేడు సీఎం జగన్ కీలక సమావేశం

నేడు సీఎం జగన్ కీలక సమావేశం

CM Jagan Meeting: టార్గెట్ 2024 దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు అత్యంత కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయడంలో భాగంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నేతల పని తీరుపై క్లారిటీ ఇస్తారని.. నేతలకు పదవులు.. బాధ్యతలపైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    CM Jagan Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP).. మరో సారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆ దిశగా వ్యూహాలు రచించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందకుండా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. కొత్త జిల్లాల (New District) ఏర్పాటు.. మంత్రి విర్గ విస్తరణ.. జిల్లాలకు పార్టీ అద్యక్షులు, ఇంఛార్జ్ మంత్రులు (Incharge Minsters).. ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు..  ఇవాళ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లు ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొంది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది.

    ఏపీలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. సీఎం జగన్ ముందస్తు ఆలోచనల్లో ఉన్నారా. జాతీయ రాజకీయాల్లో ఏపీ ఎన్నికలు ముడి పడిఉన్నాయా. వీటన్నింటికీ రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టార్గెట్ 2024 మాత్రమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం.. పార్టీలో మార్పులు పూర్తి చేసిన సీఎం జగన్.. కార్యాచరణ ప్రకటనకు సిద్దమమ్యారు. ఇదే సమయంలో జగన్ నిర్ణయాలు.. ఆలోచనలు చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే చర్చ విపరీతంగా జరుగుతోంది.  జగన్ చాలా కాలం తరువాత పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.

    ఇదీ చదవండి : చేతులే కలిశాయి.. చూపులు కలిసేది ఎప్పుడో..? అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి

    పార్టీలో బాధ్యతలు అప్పగించిన నేతలందరితోనూ ఈ సమావేశం నిర్వహిస్తుండడంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. మంత్రులు, రీజనల్ కోర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పాటుగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి దిశా నిర్దేశం మాత్రమే కాకుండా.. బాధ్యతలు ఫిక్స్ చేయనున్నారు. రీజినల్-జిల్లా అధ్యక్షులుగా నియోజకవర్గాల వారీగా గెలుపు టార్గెట్ నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అసంతృప్తులపైనా పూర్తి ఫోకస్ చేయనున్నట్టు టాక్. అలాగే ఇకపై ఎవరైనా గీత దాటితే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి : గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే..? ఆయనకు బిగ్ షాక్.. పంతం నెగ్గించుకున్న విజయసాయి

    ఏ సమయంలో అయినా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయనే విధంగా సీఎం తన కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని.. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు..సీఎం పని తీరు పైన ప్రజల్లో సంతృప్తి ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల తీరు పట్ల వ్యతిరేకత వస్తుందనేది సర్వేల్లో తేలినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాంటి నేతలకు వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Cm jagan, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు