Home /News /andhra-pradesh /

AP POLITICS YCP CHIEF JAGAN MOHAN REDDY FOCUS 2024 ELECTION HE WILL MEET ALL MLA AND GAVE SAME SUGGESTIONS NGS

CM Jagan will Meet MLAs: పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ భేటీ.. రిపోర్ట్ కార్డులు సిద్ధమయ్యాయా..? నేతల్లో టెన్షన్

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

CM Jagan will Meet MLAs: టార్గెట్డ 2024 దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాల కంటే వ్యూహాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప్రక్షాళనపై ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ వ్యక్తిగతంగా కలవనున్నారు. వారి రిపోర్ట్ కార్డు ముందు పెట్టి.. హెచ్చరికలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  CM Jagan will Meet MLAs: పాలనా పరంగా.. పార్టీ పరంగా సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇంతులో భాగంగా ఇప్పటికే కొత్త జిల్లాల (New District) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. టాలీవుడ్ (Tollywood) సహా.. ఏఏ వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని భావించారో వాటిని దగ్గరకు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధికారులు తీరుతోనే స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి.. బదిలీలు కూడా వేగంగా చేస్తున్నారు. ఇప్పుడు పార్టీపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు సీఎం జగన్. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోనే వచ్చే ఎన్నికలకు కార్యాచరణ సిద్దం చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనుగుణంగానే రేపటి బడ్జెట్ ఉంటుందని టాక్.. ముఖ్యంగా నవరత్నాలకు మరింత ప్రాధాన్యతతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజకీయంగానూ ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వం మీద చేస్తున్న పలు అంశాలకు సంబంధించిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు.

  ముఖ్యంగా ఆయన ఫోకస్ అంతా.. ప్రస్తుతం ఎమ్మెల్యేలపైనే ఉన్నట్టు సమాచారం.. ఎందుకంటే చాలామంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే నివేదిక అధినేతకు అందినట్టు సమాచారం. అందకే ప్రభుత్వం పరంగా.. ప్రైవేటు పరంగా.. అలాగే రాజకీయ వ్యూహకర్తలతో ఇలా వేర్వేరుగా నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. అందులో ఎక్కువమందిపై వ్యతిరేకత కనిపిస్తుండడంతో ముందుగా వారందరినీ కలిసి హెచ్చరికలు చేయాలని అధినేత జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికలకు సుమారు రెండేళ్లు సమయం ఉండడంతో ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలను సిద్ధం చేయడం మంచిందని.. ఆఖరు నిమిషం వరకు నాన్చితే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని జగన్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.. అందులో భాగాంగనే ఆయన నేరుగా ఎమ్మల్యేలను నేరుగా కలుస్తారనే టాక్ ఉంది..

  ఇదీ చదవండి : రామ్ చరణ్ ను దింపేసిన వైసీపీ యూత్ లీడర్.. లైలా ఓ లైలా అంటున్న బైరెడ్డి

  చాలా కాలంగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కావాలని భావిస్తున్నారు. కానీ, అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ సమావేశం ముగిసిన తరువాత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు .. ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ డిసైడ్ చేయనున్నారు. అంతేకాదు వారి ప్రోగ్రస్ రిపోర్ట్ ఏంటి అన్నది వారి ముందే పెట్టి.. ఇంకా సమయం ఉంది కాబట్టి తీరు మార్చుకోవాలని.. లేదంటే ఇబ్బందులు తప్పవని ఒక వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది.. అలాగే ఇక, నుంచి పార్టీకి సంబంధించిన ప్రతీ నేత ప్రజల్లోనే ఉండాలని సీఎం ఆదేశించే అవకాశం ఉంది. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ప్లీనరీ వేదికగా సమాధానం చెప్పే అవకాశం ఉంది అంటున్నారు.

  ఇదీ చదవండి : గెలిపించినందుకు ఇదే మీకు కానుక.. వారిపై వరాలు కురిపించిన విజయసాయి రెడ్డి

  ఇక, ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే కొత్త మంత్రులతో కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో..సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ దీని పైనా సంకేతాలు ఇస్తారని భావిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు