Home /News /andhra-pradesh /

AP POLITICS YCP CHEERALA LEADER READY TO JOIN JANASENA PARTY WILL CM READY LOOSE THAT CANDIDATE NGS

AP Politics: జనసేన వైపు ఆ కీలక వైసీపీ నేతల చూపు.. సీఎం జగన్ ఆఫర్లు పని చేయలేదా..?

ఆ వైసీపీ నేత జనసేనకు జై కొడతారా?

ఆ వైసీపీ నేత జనసేనకు జై కొడతారా?

AP Politics: అధికార వైసీపీకి ఈ సారి షాక్ లు తప్పవా..? కీలక నేతల్లో కొందరు పక్క చూపులు చూస్తున్నారా..? ఇప్పటికే ఆ విషయాన్ని అధిష్టానం గుర్తించిందా..? సీఎం కలుగజేసుకుని వలసలు ఆపే ప్రయత్నం చేసినా.. కుదరడం లేదా..? తాజాగా ఓ నేత జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణమాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల విపక్షాలు పదే పదే చెబుతున్న మాట.. త్వరలో అధికార పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని.. ఆ మాటలు నిజం కాబోతున్నాయా..? మొన్నటి కేబినెట్ విస్తరణ, తాజాగా రాజ్యసభ పదవుల తరువాత అసమ్మతి నేతల లిస్టు పెరుగుతూ ఉంది. గతంలో సీఎం జగన్ (CM Jagan) ఆయా నేతలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో.. వారంతా ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా..? మరి ఆ వలసలు ఆపేందుకు వైసీపీ (YCP) అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందా.. లేక వారిని లైట్ తీసుకుంటోందా..? లేక సీఎం జగన్ ఆఫర్లు ఇచ్చినా.. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమే అని.. జంపింగ్ జపాంగ్ కి సిద్ధం అవుతున్నారా..? తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District) లో ఓ బలమైన నేత జనసేన (Janasena)లో జాయిన్ అవుతున్నారంటూ ప్రచారం ఉంది. చీరాల నియోజకవర్గంలో ఆయన బలమైన నేత. ప్రధాన రాజకీయ పక్షాలకు దీటుగా నిలబడి ఎమ్మెల్యేగా పోటీచేసి ఇండిపెండెంట్ గా గెలిచిన రికార్డు కూడా ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు.

    అయితే చీరాలలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన జనసేనలో చేరాలని నిశ్చయించుకున్నారనే ప్రచారం ఉంది. మరి అధికార వైసీపీ ఆయన్ను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా..? ఎలాగైనా ఆయనకు ఎక్కడో ఒక దగ్గర సీటు సర్దుబాటు చేసేందుకు అధినేత జగన్ ప్రయత్నిస్తున్నారుని టాక్ ఉంది. ఇటీవలే ఆ నేతను సీఎం తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని..మరోసీటు ఆఫర్ చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. కానీ ఆయన మాత్రం చీరాల కోసమే పట్టుపడుతున్నారంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే ఇదే సమయంలో లాంటి కీలక వ్యక్తులు పార్టీ మారితే.. రాష్ట్ర వ్యాప్తంగా వేరే రకమైన సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.

    ఇదీ చదవండి : క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్ర ఇదే వైసీపీ ఎన్నికల నినాదమంటున్న మంత్రి రోజా?

    గత ఎన్నికల్లో చీరాల నుంచి ఆయన పోటీ చేసి ప్రత్యర్థి చేతిలో ఓడారు. అదే సమయంలో వేరే పార్టీ నుంచి గెలిచిన నేత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో చీరాల సీటు వచ్చే ఎన్నికల్లో తనదే అని హామీ ఇవ్వడంతోనే వైసీపీ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. మరోసారి ఇటీవల సీఎం జగన్ ఆయనకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారట.. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు.. చీరాలే కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు. దీంతో ఎవరో ఒకరికి.. మరోదగ్గర సీటు కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉంది. కానీ ఆ సర్దుబాటుకు ఇద్దరూ సిద్ధంగా లేదు.. దీంతో కచ్చితంగా ఎవరో ఒకర్ని పార్టీ వదులుకునే పరిస్థితి ఏర్డింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Amanchi krishna mohan, Andhra Pradesh, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు