Home /News /andhra-pradesh /

AP POLITICS YANAMALA RAMA KRISHNUDU MAY LOST HIS SEAT AFTER NARA LOKESH PUTS NEW PROPOSALS IN MAHANADU RECENTLY FULL DETAILS HERE PRN VSP

లోకేష్ మాటలతో షాక్ లో ఆ సీనియర్ నేత.. ఇక ఇంటికి పరిమితం కావలసిందేనా..?

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

ఇటీవల మహానాడు (Mahanadu-2022) లో నారా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్, పార్టీ కోసం ఇచ్చిన ప్రతిపాదనలు కొందరు నేతలకు కంటిమీద కునుకులేకండా చేస్తున్నాయి. వారిలో అందరికంటే ముందున్నారు యనమల.

  P Anand Mohan, News18, Visakhapatnam

  ఆయన రాష్ట్రానికే లెక్కలు చెప్పారు... తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ప్రభుత్వంలో రెండు సార్లు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పీఏసీ ఛైర్మన్‌ పదవిలో కూడా కొనసాగారు. ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ఆయనే శాసన సభాపతి. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనే నెంబర్ టూ... పార్టీ ఏం చేయాలన్నా కూడా ఆయనే కీలకం. ఇన్ని ప్రత్యేకతలున్నా కూడా... సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయనకు అంత సీన్ లేదనేలా పరిస్థితి మారిపోయింది. ఆయన మరెవరో కాదు... యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu). ఐతే ఇటీవల మహానాడు (Mahanadu-2022) లో నారా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్, పార్టీ కోసం ఇచ్చిన ప్రతిపాదనలు కొందరు నేతలకు కంటిమీద కునుకులేకండా చేస్తున్నాయి. వారిలో అందరికంటే ముందున్నారు యనమల.

  తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉన్న యనమల చుట్టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1983లో తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన యనమల రామకృష్ణుడు తొలిసారే 21 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1985లో మరోసారి ఎన్నికైన యనమల... ఎన్టీఆర్ ప్రభుత్వంలో న్యాయ, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు తుని నుంచి అసెంబ్లీకి ఎన్నికైన యనమల... డబుల్ హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, స్పీకర్‌గా కీలక బాధ్యతలే వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా... లెక్కల మాష్టారుగా వ్యవహరించిన యనమల... తన సొంత నియోజకవర్గంలో మాత్రం లెక్కలు వేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

  ఇది చదవండి: పవన్ కు అండగా కుటుంబం.. కీలక సమయంలో భారీ సాయం.. దేనికోసమంటే..?


  ఆరుసార్లు వరుసగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట కృష్ణంరాజు చేతిలో తొలిసారి ఓడిపోయారు. అయితే యనమల చట్టసభల్లో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఆయనను మండలికి పంపారు చంద్రబాబు. అదే సమయంలో తుని నియోజకవర్గం నుంచి రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడును పోటీలో నిలిపారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన యనమల కృష్ణుడు... వైసీపీ నేత దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా అదే దాడిశెట్టి రాజా చేతిలో ఏకంగా 24 వేల ఓట్ల తేడాతో యనమల కృష్ణుడు వరుసగా రెండో సారి కూడా ఓడారు.

  ఇది చదవండి: YS Jaganని ఓ రేంజ్‌లో పొగిడిన అలీ.. రాజ్యసభ మిస్ అయినా.. తగ్గేదేలేదంటున్న యాక్టర్


  పార్టీలో నెంబర్ టూగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడి తీరుపై ఇప్పటికే పలువురు పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో పార్టీ మారిన సీనియర్లు సైతం... యనమలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన వారే. చంద్రబాబు కొంతమంది నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారారని... చంద్రబాబు చుట్టూ ఓ కోటరి చేరిందంటూ... యనమలను టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేశారు. వాస్తవానికి యనమలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో దగ్గరి బంధుత్వం ఉంది. గతంలో టీడీపీ సర్కారుపైన, చంద్రబాబు పైన తలసాని ఘాటు వ్యాఖ్యలు చేసిన సమయంలో కూడా యనమల కనీసం స్పందించలేదు. బంధువుతో చర్చించే ప్రయత్నం కూడా చేయలేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే కూడా... స్వ ప్రయోజనాలకే యనమల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

  ఇది చదవండి: ఆ జిల్లా నేతలతో వైసీపీకి తప్పని టెన్షన్.. ఆశలు వదులుకోవాల్సిందేనా..


  రాష్ట్రానికి లెక్కలు చెప్పే నేత... తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఓటర్ల మనసులు ఆకట్టుకోవడంలో... గెలుపు ఓటముల లెక్కలు అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం తుని నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా యనమల కృష్ణుడు వ్యవహరిస్తున్నాడు. ఆయనపై కింది స్థాయి క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆయన తీరుపై ఇప్పటికే పలువురు నియోజకవర్గం నేతలు చంద్రబాబుకు, లోకేష్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే.. తుని నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి కూడా పార్టీ ఓటమి ఖాయమనేలా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  మహానాడు వేదికపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో కొత్త నేత తప్పడనే పుకార్లకు బలం ఇస్తోంది. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిన వారికి మరో అవకాశం లేదని లోకేష్ స్పష్టం చేశారు. 2009లో యనమల రామకృష్ణుడు ఓడిపోగా.. 2014, 2019లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఓడిపోయారు. మరి లోకేష్ తాను చెప్పిన మాట ప్రకారం తునిలో అభ్యర్థిని మారుస్తారా లేదా చూడాలి మరి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, East Godavari Dist, TDP, Yanamala Rama Krishnudu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు