Home /News /andhra-pradesh /

AP POLITICS WOMEN MLA WILL GAVE SHOCK TO TELUGU DESAM PARTY HI COMMAND WHAT IS THE REASON NGS

Telugu Desam: గత ఎన్నికల్లో నెగ్గిన చోట కూడా టీడీపీ షాక్.. ఆ మహిళా నేత పోటీకి దూరం అవుతున్నారా..?

తెలుగు దేశానికి ఆ నేత షాక్

తెలుగు దేశానికి ఆ నేత షాక్

Telugu Desam: ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో కేడర్ లో జోష్ పెరుగుతుంటే.. మరోవైపు కొందరి నేతల తీరు షాక్ ఇస్తోంది. తాజాగా ఓ మహిళ నేత.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా.. ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం దీనిపై ఏం చేయనుంది.

ఇంకా చదవండి ...
  Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రాజమండ్రి (Rajhamundry) ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) గాలిలో సైతం తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) గెలుపొందింది. అయితే అక్కడి తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా.. ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఉంది. అందుకే అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవానీ (Adireddy Bhavani) ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. ప్రస్తుతం ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) సోదరి.. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adi Reddy Apparao) కోడలు. అర్బన్‌లో భవాని నెగ్గితే.. రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butcahi Chowdari) గెలిచారు. దీంతో మూడేళ్లుగా ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా ఉంటున్నాయి. ఇంతలో అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చేసిన ప్రకటన తెలుగు దేశం పార్టీలో సంచలనంగా మారింది.

  వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి తన భర్త ఆది రెడ్డి శ్రీనివాసు (Adi Reddy Srinivasu) పోటీ చేస్తారని ఎమ్మెల్యే భవాని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదన్నది ఆమె మాట. వాస్తవానికి 2019లోనూ చివరి నిమిషంలో తనను టీడీపీ అధిష్ఠానం పోటీ చేయిందనీ చెప్పుకొచ్చిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తనకంటే భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాసుయేనని చెప్పడంపై కేడర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.  వాస్తవానికి ఆదిరెడ్డి కుటుంబంలో శ్రీనివాస్‌ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా రాజ కీయంగా పదవులు అనుభవించినవాళ్లే. వాసు తండ్రి అప్పారావు ఎమ్మెల్సీగా, తల్లి వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. వాసు భార్య భవాని ఎమ్మెల్యే. 2019లో వాసునే టీడీపీ టికెట్‌పై పోటీ చేయాల్సి ఉంది. కానీ.. భవానీకి టికెట్‌ ఇచ్చింది పార్టీ. అందుకే వచ్చే ఎన్నికల్లో వాసును బరిలో దించి ఎమ్మెల్యేగా చేయాలని ఆదిరెడ్డి కుటుంబం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి అర్బన్‌ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట.

  ఇదీ చదవండి : ఆ భక్తులకు గుడ్ న్యూస్.. ఇక కొండపైనే రూ.300 దర్శన టికెట్లు.. ఎలా పొందాలి అంటే..?

  ఇప్పటికే కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్నారు. పైగా ఆదిరెడ్డి కుటుంబంతో ఆయనకు పడటం లేదు. రాజమండ్రి రూరల్‌ నుంచి రెండుసార్లు. రాజమండ్రి అర్బన్‌ నుంచి నాలుగుసార్లు గెలిచారు బుచ్చయ్య చౌదరి. సిటీని వదిలేసి తప్పు చేశానన్న ఫీలింగ్‌లో ఆయన ఉన్నారట. పైగా అర్బన్‌లో అనుచరగణం ఉండటంతో రాజమండ్రిపై గట్టి ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే భవాని ముందుగానే ప్రకటన చేశారా? అని కేడర్ అనుమానిస్తోంది.

  ఇదీ చదవండి : ‘క్విట్ జగన్ సేవ్ ఆంధ్ర ’ ఉత్తరాంధ్రలో జోష్ పెంచిన చంద్రబాబు పర్యటన

  ఆ మధ్య ఆదిరెడ్డి శ్రీనివాసు రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఆయన మాత్రం అసెంబ్లీకే బరిలో ఉంటానని అనుచరులకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో రాజమండ్రిలో పట్టు నిలుపుకొనేందుకు ఆదిరెడ్డి కుటుంబం చేయని ప్రయత్నం లేదు. ఆదిరెడ్డి, గోరంట్ల వర్గాల మధ్య నిత్యం గొడవలు కామనైపోయాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తున్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు