హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSRCP Plenary: వైసీపీ ప్లీనరీ.. అందరి దృష్టి ఆమెపైనే.. రాకపోతే ఇక అంతేనా ?

YSRCP Plenary: వైసీపీ ప్లీనరీ.. అందరి దృష్టి ఆమెపైనే.. రాకపోతే ఇక అంతేనా ?

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

AP Politics: జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత విజయమ్మ ఎటు వైపు అనే చర్చ జరిగింది.

ఏపీలోని అధికార వైసీపీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహణకు సిద్ధమైంది. గుంటూరు-విజయవాడ (Guntur Vijayawada) నగరాల మధ్యలో నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ప్లీనరీకి వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ (YS Vijayamma) హాజరవుతారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి వైసీపీకి చాలాకాలం నుంచి విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ వ్యవహారాలను ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. పార్టీ అధినేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత విజయమ్మ ఎటు వైపు అనే చర్చ జరిగింది.

అయితే విజయమ్మ కొంతకాలం నుంచి పూర్తిగా షర్మిలతోనే ఉంటున్నారు. కొన్నిసార్లు ఆమె పాదయాత్రలో పాల్గొంటున్నారు. తెలంగాణలో షర్మిలను ఆదరించాలని ప్రజలను కోరుతున్నారు. తన కూతురికి అండగా ఉండాలని.. గతంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో దివంగత వైఎస్ఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను కోరారు. ఈ క్రమంలోనే ఆమె సీఎం వైఎస్ జగన్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్నారనే చర్చ జరిగింది.

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్.. 2024 ఎన్నికలే టార్గెట్.. జగన్ వ్యూహం ఇదేనా..!

Chandrababu: సొంత జిల్లాపై చంద్రబాబు యాక్షన్ ప్లాన్.. మెయిన్ టార్గెట్ అదే

అసలు విజయమ్మ ప్రస్తుతం వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారా ? లేదా ? అన్నది కూడా ఎవరికీ అర్థంకావడం లేదు. అయితే వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొని.. ఆ తరువాత పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విజయమ్మ ఈ సమావేశాలకు వస్తారా ? లేక ఎప్పటిలాగే వైసీపీకి దూరంగా ఉండిపోతారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక విజయమ్మ ప్లీనరీకి రాకపోతే.. ఇక వైసీపీతో ఆమె బంధం పూర్తిగా తెగిపోయినట్టే అని పలువురు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Vijayamma, Ysrcp

ఉత్తమ కథలు