వైసీపీలో సుప్రీం ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీకి(Ysrcp) గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీలో విజయమ్మ కీలకంగా వ్యవహరించారు. అయితే జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత విజయమ్మ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడం లేదు. అయితే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు హోదాలో మాత్రం విజయమ్మ (YS Vijayamma) ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అయితే జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విజయమ్మ వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరగనున్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొని.. ఆ తరువాత వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై అటు విజయమ్మ, ఇటు వైసీపీ వర్గాలు స్పందించలేదు. తాజాగా ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి(Mangalagiri) సమీపంలోని గ్రౌండ్స్‌లో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ప్లీనరీలో చర్చించే ఆమోదించే తీర్మానాల గురించి వివరించారు. ప్లీనరీలో సుమారు 15 తీర్మానాలు ఉండొచ్చని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం సవరణల కోసం కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఒకవేళ సీఎం జగన్ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడు అనే సవరణ చేస్తే.. విజయమ్మ కూడా శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారని ఆయన తెలిపారు.
గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ ప్లీనరీకి వస్తారని.. ఈ విషయంలో వేరే ఆలోచన అవసరం లేదని ఆయన తెలిపారు. అయితే కొంతకాలంగా సీఎం జగన్‌కు దూరంగా తన కూతురు, వైఎస్ఆర్ కూతురు షర్మిలకు తోడుగా ఉంటున్నారు విజయమ్మ. షర్మిల తెలంగాణ పర్యటనలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్టీపీ అనే పార్టీ ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీకి సహకరించాలని, షర్మిలకు తోడుగా నిలవాలని విజయమ్మ పలువురు తెలంగాణ నేతలకు సూచించారు. వీలు దొరికప్పుడల్లా షర్మిలతో కలిసి తెలంగాణలో పర్యటనలు కూడా చేస్తున్నారు.
Chandrababu letter to PM: ఏపీ ప్రభుత్వంపై చర్యలకు ఆలస్యం ఎందుకు..? కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఘాటు లేఖ
ఈ పరిణామాలతో ఏపీలో వైసీపీకి విజయమ్మ అధికారికంగా దూరం కావడం ఒక్కటే మిగిలిందని.. వైసీపీ ప్లీనరీ తరువాత ఆమె అధికారికంగా వైసీపీకి దూరం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఈ సమావేశాలకు విజయమ్మ హాజరైతే పర్వాలేదు కానీ.. ఒకవేళ పార్టీ కీలక సమావేశాలకు ఆమె దూరంగా ఉంటే మాత్రం ఇక ఆమె వైసీపీకి అనధికారికంగా దూరంగా ఉన్నట్టే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ సవరణలతో విజయమ్మ ఆ పార్టీకి శాశ్వత గౌరవ అధ్యక్షురాలు అవుతారా ? లేక పార్టీకి దూరమవుతారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Vijayamma, Ysrcp