హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ‘విశాఖ’ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా ?

YS Jagan: ‘విశాఖ’ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా ?

సీఎం జగన్, విశాఖ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్, విశాఖ (ఫైల్ ఫోటో)

YS Jagan: మరోవైపు ఈ విషయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీలోని పట్టభద్రుల నియోకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చేశాయి. ఇప్పటివరకు ఏపీలో వైసీపీకి(Ysrcp) రాజకీయంగా తిరుగులేదనే వాతావరణం ఉండగా.. మూడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడటంతో.. సీని మారిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికలు టీడీపీలో(TDP) జోష్ పెంచాయి. క్షేత్రస్థాయిలో తమ పట్ల సానుకూలత ఉందని.. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. దీంతో పాటు అమరావతి విషయంలోనూ తమ అభిప్రాయమే ప్రజల్లోనూ ఉందనే విషయాన్ని ఈ ఎన్నికలు చాటిచెప్పాయని టీడీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పరిధిలోని ఎన్నికల్లో తాము గెలవడంతో.. విశాఖ(Visakhapatnam) వాసులు కూడా రాజధాని విషయంలో ఆసక్తిగా లేరనే అంశంపై టీడీపీ నాయకత్వానికి ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం.

మరోవైపు ఈ విషయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జులై నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్ మంత్రివర్గంలో ప్రకటించారు. అంతకుముందు ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో కచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ విషయంలో యూటర్న్ తీసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

విశాఖను రాజధానిగా చేయడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం లభించే అవకాశం లేకపోగా.. రాజకీయంగా నష్టమే జరిగే అవకాశం ఉంటుందనే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో మొదలైనట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంత దూరంగా ముందుకు వచ్చిన తరువాత వెనక్కి తగ్గితే.. రాజకీయంగా మరింతగా నష్టపోయే అవకాశం ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు విశాఖ రాజధాని విషయంలో ఎఫ్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వచ్చిన వైసీపీ ముఖ్యనేతలు, మంత్రులు.. ఈ ఫలితాల తరువాత ఏ విధంగా రియాక్ట్ అవుతారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

AP Congress: ఆర్థిక కష్టాల్లో ఏపీ కాంగ్రెస్ .. హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్

Janasena-Bjp: జనసేన , పవన్ కళ్యాణ్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు..

ఇక వచ్చే ఎన్నికలను మూడు రాజధానులే అజెండాగా ముందుకు సాగాలని భావిస్తున్న వైసీపీ నాయకత్వం.. ఈ పరిణామాల తరువాత మరింత సుదీర్ఘంగా దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందేమో అనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఏపీలోని పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు.. టీడీపీకి బిగ్ రిలీఫ్ ఇవ్వగా.. వైసీపీ నాయకత్వానికి షాక్ ఇవ్వడంతో పాటు పలు సవాళ్లును ముందుంచాయనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు