YS Vijayamma: వైసీపీ (YCP) గౌరవాధ్యక్షురాలు.. సీఎం జగన్ (CM Jagan) తల్లి విజయమ్మ (Vijayamma) జన్మదినం అంటే పార్టీలో సంబరాలు ఉండాలి.. పార్టీ నుంచి శుభాకాంక్షల వెల్లువెత్తాలి. కనీసం అధినేత జగన్... పార్టీ అధినేతగా కాకపోయినా.. కొడుకుగా తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కలవడమో.. లేదా ఏదో ఒక రూపంలో శుభాకాంక్షలు తెలపడమే చేయాలి.. కానీ వైసీపీ (YCP) తరపున ఒక్క విజసాయి రెడ్డి (Vijayasai Reddy) ట్వీట్ మినహా.. ఆమె పుట్టిన రోజు గురించి వైసీపీలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. అంటే విజయమ్మ ఇప్పుడు వైసీపీకి దూరమయ్యారా..? అందుకే ఆమె పుట్టిన రోజుకు.. వైసీపీ నేతలు అంతా ప్రాధాన్యం ఇవ్వలేదా..? అయితే అదే సమయంలో.. తెలంగాణ (Telangana) లో పార్టీ పెట్టి.. పాదయాత్రలతో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల (YS Sharmila) తో కలిసి విజయమ్మ మెరిసారు. షర్మిల అనుచరులు, తెలంగాణ అభిమానుల మధ్య విజయమ్మ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పాదయాత్రలో ఉన్న షర్మిల వద్దకు విజయమ్మ వెళ్లారు..
కుమార్తెను కలిసిన సమయంలో షర్మిల తన తల్లితో కేక్ కట్ చేయించారు. ముద్దాడి బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ ట్వీట్ చేసారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా అన్నారు. ఇలా తల్లి పుట్టిన రోజు వేడుకల్లో షర్మిల భాగమయ్యారు. దగ్గరుండి వేడుకలు నిర్వహించారు.. అయితే ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో బిజీ ఉన్నారు. విజయమ్మని కలవకపోవడం సంగతి అటు ఉంచితే.. కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోకవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇదీ చదవండి : సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖకు విడుదల రజని.. ఏ జిల్లాలకు ఎవరు ఇన్ ఛార్జ్ ?
షర్మిల తెలంగాణ పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆమె షర్మిలతోనే ఎక్కువగా ఉంటున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో సీఎం జగన్ తో కనిపించినా.. గతంలో ఉన్నంత ఆప్యాయత కనిపించ లేదన్నది వైఎస్ అభిమానుల మాట. సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పకపోయినా..? వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి సైతం విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. అందులో..జగన్ ను విజయమ్మ ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసారు. ట్వీట్ లో... వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు.
ఇదీ చదవండి : వైసీపీ అసంతృప్తులకు సీఎం జగన్ బుజ్జగింపులు.. ఆ ఇద్దరు నేతలకు కీలక పదవులు
మరోవైపు ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిలతో ఉంటూ.. వైసీపీ పదవిలో కొనసాగడం సరైంది కాదని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగని ఆమెను పార్టీ పదవుల నుంచి తొలిగిస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని సీఎం అంచనాకు వచ్చినట్టు టాక్.. అందుకే ఆమెతోటే పార్టీ పదవికి రాజీనామా చేయిస్తే ఏ సమస్య ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. అలాగే జూలై 8న వైఎస్సార్ జన్మదినం సందర్బంగా వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి : సర్ ప్రైజ్ అంటూ యువకుడి గొంతుకోసిన ఘటనలో ట్విస్ట్.. అచ్చం దేశముదురు సినిమాలాగే..?
జగన్ తన పాదయాత్రకు ముందు పార్టీ ప్లీనరీ నిర్వహించారు. అందులో విజయమ్మ - షర్మిల హాజరయ్యారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సైతం అదే వేదిక నుంచి పార్టీ నేతలకు పరిచయం చేసారు. ఈ సారి పార్టీ ప్లీనరీకి సైతం విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష హోదాలో హాజరవుతారని.. అయితే ఆ సభ తరువాత ఆమె పార్టీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక అప్పటి నుంచి పూర్తి స్థాయి సమయం కూతురు పార్టీ పైనా పెడతారనే ప్రచారం ఉంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, YS Sharmila, YS Vijayamma