హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Chandrababu: చంద్రబాబు వల్ల కానిది.. వైఎస్ జగన్ వల్ల అవుతుందా ?.. ఏపీలో ఆసక్తికర చర్చ

YS Jagan-Chandrababu: చంద్రబాబు వల్ల కానిది.. వైఎస్ జగన్ వల్ల అవుతుందా ?.. ఏపీలో ఆసక్తికర చర్చ

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

AP Politics: వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని చిత్తూరు జిల్లా మంత్రి, వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను ఏ విధంగా దెబ్బకొట్టాలనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాయి. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. ప్రస్తుతం ఏపీలోని అధికార పార్టీ వైసీపీ సైతం తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని టీడీపీని దెబ్బకొట్టేందుకు అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టీడీపీని ఊహించని విధంగా దెబ్బకొట్టిన వైసీపీ(YSRCP).. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీకి(TDP) షాక్ ఇస్తూనే వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీని నిలవరించి మరోసారి అధికారంలోకి రావాలన్నది వైసీపీ అభిమతం. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ప్లాన్ చేస్తున్నారు. టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబును(Chandrababu) సొంత నియోజకవర్గంలో టార్గెట్ చేయడం ద్వారా టీడీపీని మరింతగా దెబ్బకొట్టవచ్చన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

  ఈ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటిని గెలుచుకోవడం ద్వారా తన ప్లాన్‌ను కొంతమేరకు సక్సెస్ చేసుకుంది అధికార వైసీపీ . అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో కుప్పం సీటును గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. త్వరలోనే సీఎం జగన్ కుప్పం పర్యటన కూడా చేపట్టబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది ? తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది ? అనే అంశాలను ప్రజలకు వివరించనున్నారు సీఎం వైఎస్ జగన్.

  వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని చిత్తూరు జిల్లా మంత్రి, వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ సీఎం జగన్‌ను ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఓడించేందుకు అనేక వ్యూహాలు రచించారు. పులివెందుల నియోజకవర్గానికి తామే నీళ్లు ఇచ్చామని.. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగురుతుందని టీడీపీ నేతలు ప్రకటించారు.

  CM Jagan: పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చంద్రబాబే కారణం.. కేంద్రం నుంచి డబ్బులు రావడం లేదన్న సీఎం జగన్

  AP Deputy Speaker: కోన రఘుపతి ప్లేస్ లో కోలగట్ల వీరభద్ర స్వామి.. స్పీకర్, డిప్యూటీ ఇద్దరూ ఉత్తరాంధ్ర నేతలే.. కారణం ఇదే

  కానీ టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ జగన్‌ను పులివెందులలో ఓడించలేకపోయారు. కనీసం మెజార్టీని కూడా తగ్గించలేకపోయారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రయత్నమే ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నారు. చంద్రబాబును ఆయన సొంత నియోజకర్గమైన కుప్పంలో ఓడిస్తామని వైసీపీ ప్రకటించింది. దీంతో గతంలో చంద్రబాబు వల్ల కాని పని ఇప్పుడు జగన్ వల్ల అవుతుందా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు