హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan-Ali: అలీకి వైఎస్ జగన్ ఈసారైనా ఆ అవకాశం ఇస్తారా ?

YS Jagan-Ali: అలీకి వైఎస్ జగన్ ఈసారైనా ఆ అవకాశం ఇస్తారా ?

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

AP Politics: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అధికార, విపక్షాలు ఎన్నికల కోసం అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఏపీలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికలకు మరో ఏడాది ముందుగానే ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా ఏళ్లుగా భావిస్తున్న సినీనటుడు, వైసీపీ నాయకులు అలీకి(Ali).. ఆ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో అయినా ఛాన్స్ ఇస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు అలీ. టీడీపీ(TDP) లేదా జనసేనలోకి వెళతారని భావించిన అలీ.. అనూహ్యంగా వైసీపీ(Ysrcp) కండువా కప్పుకున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆయనకు ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం. అలీకి వైసీపీ ప్రభుత్వం చాలా చిన్న పదవి ఇచ్చిందనే చర్చ కూడా సాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న అలీ.. జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని అన్నారు.

అలీకి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసే వైసీపీ నాయకత్వం దాదాపుగా ఇవ్వకపోవచ్చు. అయితే ముస్లిం ఓట్లు ప్రభావం చూపే స్థాయిలో ఉన్న నియోజకవర్గాల్లో అలీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంటుందన్నది పలువురి అభిప్రాయం. నిజానికి గుంటూరు పట్టణంలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అలీ గతంలో అనుకున్నారు. కానీ వైసీపీ నాయకత్వం ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా అలీ ఆశలు నెరవేరతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Nara Lokesh: 2024లో దబిడి దిబిడే.. వైసీపీకి లోకేష్ మాస్ వార్నింగ్

Ap News: సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ..మళ్లీ హైకోర్టుకు జీవో-1..విచారణ ఎప్పుడంటే?

అయితే ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం అప్పుడే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ .. అలీకి పోటీ చేసే అవకాశం ఇస్తారా ? అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాలం కలిసి వస్తే తనకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని అలీ భావిస్తున్నారు. సీఎం జగన్‌కు ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పిన అలీ.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. వైసీపీ అధినేత తనకు ఆ ఛాన్స్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోలేకపోయిన అలీకి.. వచ్చే ఎన్నికల్లో అయినా అలాంటి అవకాశం దక్కుతుందా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Andhra Pradesh, Ys jagan

ఉత్తమ కథలు