హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rahul gandhi: ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా?..రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే..

Rahul gandhi: ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా?..రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే..

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ  (Rahul Gandhi) మీడియాతో మాట్లాడుతూ..విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Andhra Pradesh

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర  (Bharat jodo yatra) ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ  (Rahul Gandhi) మీడియాతో మాట్లాడుతూ..విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉంది. గతంలో జరిగిన విభజన కాకుండా..భవిష్యత్ పై దృష్టి పెట్టాలి. ఏపీలో భారత్ జోడో యాత్రకు  (Bharat jodo yatra) మంచి స్పందన వస్తుంది. దీనితో ఏపీలో కాంగ్రెస్ ను పునర్నిర్మాణం  చేస్తాం.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తాం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Rahul Gandhi: ఏపీ రాజధాని అమరావతి మాత్రమే.. ఏపీలో రాహుల్ గాంధీ యాత్రకు భారీ స్పందన

ఏపీలో పార్టీలు రాజకీయాన్ని బిజినెస్ లా చేస్తున్నాయి. దేశంలో హింస, ద్వేషం పెంచుతున్నారు. ఏపీకిఒకే  రాజధాని ఉండాలి. 3 రాజధానుల నిర్ణయం సరైనది కాదని రాహుల్ గాంధీ  (Rahul Gandhi) అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం కోసం ఏపీలో వైసీపీతో కలిసి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా..ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ  (Rahul Gandhi) వెల్లడించారు. పొత్తుల విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదు. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించి కాదని అన్నారు.  అలాగే కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏంటో అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ అన్నారు.

AP Politics: చంద్రబాబు-పవన్ సమావేశంపై బీజేపీ అలర్ట్.. సోమువీర్రాజు సంచలన నిర్ణయం

శశిథరూర్ ఆరోపణలపై స్పందన:

అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శశిథరూర్ ఆరోపణలపై రాహుల్ గాంధీ  (Rahul Gandhi) స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరిగాయన్నారు.

రాహుల్ గాంధీ  (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర  (Bharat jodo yatra) నేటికీ 41వ రోజుకు చేరుకుంది. రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాహుల్ గాంధీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నారు. తమ అభిమాన నాయకున్ని కలవాలని కార్యకర్తలు తహతహలాడుతున్నారు. కాగా నెల 23న రాహుల్ గాంధీ  (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) తెలంగాణకు చేరుకోనుంది.

First published:

Tags: Ap, Congress, Rahul Gandhi