Home /News /andhra-pradesh /

AP POLITICS WILL RENUKA CHOWDARY TEST HER LUCK IN ANDHRA PRADESH POLITICS THAN TELANGANA AK

Renuka Chowdary: రేణుక చౌదరి అలా చేయబోతున్నారా ? వర్కవుట్ అవుతుందా ?

రేణుక చౌదరి (ఫైల్ ఫోటో)

రేణుక చౌదరి (ఫైల్ ఫోటో)

Renuka Chowdary: తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్న రేణుక చౌదరి.. ఏపీ వైపు ఫోకస్ చేయడానికి ఏదో ఒక అంశంపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి.. తెలంగాణ వచ్చిన తరువాత మాత్రం కొత్త రాష్ట్రం రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోవడం కూడా ఇందుకు ఓ కారణమని చెప్పుకోవచ్చు. అయితే అమరావతి రైతుల ఆందోళనలో పాల్గొన్న రేణుకా చౌదరి (Renuka Chowdary).. వారికి మద్దతుగా మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) వస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు మాజీమంత్రి కొడాలి నాని. దీనిపై స్పందించిన కొడాలి నాని.. అవసరమైతే గుడివాడ(Gudiwada) నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రేణుక చౌదరి గుడివాడ నుంచి పోటీ చేస్తాననే వ్యాఖ్యలను చాలామంది సీరియస్‌గా తీసుకోవడం లేదు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్న రేణుక చౌదరి.. ఏపీ వైపు ఫోకస్ చేయడానికి ఏదో ఒక అంశంపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు రేణుక చౌదరి తన హవా కొనసాగించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గిన తరువాత ఆమె కూడా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడం కష్టమనే ఆలోచనకు వచ్చిన రేణుక చౌదరి.. ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేణుక చౌదరి గుడివాడ నుంచి పోటీ చేస్తానని సవాల్ చేయడం సంగతి అలా ఉంచితే.. అవకాశం ఉంటే ఏపీలోని ఏదో ఒక స్థానం నుంచి ఆమె బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ప్రభావం చూపే కమ్మ సామాజికవర్గానికి చెందిన రేణుక చౌదరి.. ఏపీలోని టీడీపీలో చేరిన అక్కడ పోటీ చేస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది. Jr NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తారక్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? Jr NTR-kodali Nani: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? అయితే తెలంగాణ రాజకీయ నాయకురాలైన రేణుక చౌదరి ఏపీలో పోటీ చేస్తే.. ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. ఆమెపై పోటీ చేసే ప్రత్యర్థులకు అదే పెద్ద అస్త్రంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఏపీలో రేణుక చౌదరి రాజకీయాలు చేయాలని అనుకున్నా.. ఆమెకు అవకాశం ఇచ్చే పార్టీలు ఈ అంశం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన రావొచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్న రేణుకా చౌదరి.. భవిష్యత్తులో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా ? లేక తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతారా ? అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు