Purandewari: నారా-దగ్గుబాటి కుటుంబాలు ఒక్కటి అవుతున్నాయా..? మొన్నటి వరకు లోకేష్ అంటేనే అంత ఎత్తున విమర్శలు చేసే.. పెద్దమ్మ మాట ఇప్పుడు ఎందుకు మారింది..? లోకేష్ ను మద్దతు చేస్తున్నా అని ఆమె చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..
Purandewari: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Prdwsh ) లో రాజకీయ పరిణమాలు మారుతున్నాయా..? శత్రువులు మిత్రులు అవుతున్నారా.. ఎప్పటికీ కలవవు అనుకున్న కుటుంబాలు ఒక్కటి అవుతున్నాయా..? ప్రస్తుతం వేర్వేవేర్వు పార్టీల్లో ఉన్న ఆ బంధువులు.. ఇకపై ఒక్కటి అవుతున్నారా..? ఇలాంటి అనుమానాలకు తావిచ్చాయి తాజాగా దగ్గుబాటు పురంధేశ్వరి (Purandewari) వ్యాఖ్యలు.. ఎందుకంటే అనూహ్యంగా ఆమె
చినబాబు లోకేశ్(Lokrsh)కు.. మద్దతు ఇచ్చారు. పెద్దమ్మ ఇలా బహిరంగంగా మద్దతు తెలపడం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉప్పూ-నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాలు.. మళ్లీ దగ్గరవుతున్నాయని సంకేతాలు ఇచ్చారా..? కారణం ఏదైనా ఆమె తాజాగా వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు (Daggubati venkateswara rao)లు పేరుకు.. తోడల్లుళ్లయినా.. దశాబ్దకాలంగా మాటలు, చూపులు లేక.. విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లూ లేనిది.. ఆ రెండు కుటుంబాలు ఇప్పుడెందుకు దగ్గరవుతున్నాయన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన పురంధేశ్వరి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేశ్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి.. ఈ మధ్యకాలంలో దగ్గరవుతున్న నారా, దగ్గుబాటి కుటుంబాలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయన్న సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఆమె ఏమన్నారంటూ.. తన సోదరి కుమారుడైన లోకేష్ కు రాజకీయంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. అయితే గత ఏడాది ముందుకు వరకు నారా లోకేష్ ను పురంధేశ్వరి చాలా సందర్భాల్లో విమర్శించారు. కానీ తొలిసారి లోకేష్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని పురంధేశ్వరి ప్రకటించారు.
అయితే సుదీర్ఘకాలం.. ఎడమొహం-పెడమొహంగా ఉన్న చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. గతేడాది ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి దగ్గుబాటికి, చంద్రబాబుకు మధ్య విభేదాలుండేవి. టీడీపీ నాయకులు సైతం.. రెండు వర్గాలుగా విడిపోయారు. అనేక సందర్భాల్లో.. ఏ అల్లుడికి సపోర్ట్ చేయాలో తెలియక.. ఎన్టీఆర్ కూడా సతమతమయ్యేవారు. రాజకీయంగా మొదలైన పోటీ.. రెండు కుటుంబాల మధ్య అగాథాన్ని పెద్దదిగా చేసింది. రెండు కుటుంబాల మధ్య కిలోమీటర్ల కొద్దీ గ్యాప్ పెరిగిపోయింది. రాజకీయంగా విడిపోయిన వీరు.. కుటుంబపరంగానూ కలవని స్థాయికి విభేదాలు చేరుకున్నాయి..
గతేడాది వరకు రెండు కుటుంబాల మధ్య అదే పరిస్థితి ఉండేది. కానీ ఆ మధ్య ఎన్టీఆర్ మనవరాలి పెళ్లి వేడుక తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. భువనేశ్వరిని అవమానించారంటూ.. చంద్రబాబు బాధపడటం, కుటుంబసభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి అండగా నిలబడటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో.. ఓ కుటుంబానికి మరో కుటుంబం మద్దతు ప్రకటిస్తూ రావడం, రాజకీయాలకు అతీతంగా.. కష్టనష్టాల్లో వెన్నుదన్నుగా నిలుస్తుండటం లాంటి పరిణామాలు.. వారి మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరుస్తూ వచ్చాయ్. అంతేకాదు ఈ సారి సంక్రాంతి సంబరాల కోసం తొలిసారి అక్క ఇంటికి వెళ్లారు నందమూరి బాలయ్య.. ఆ సమయంలోనూ టీడీపీలోకి దగ్గుబాటు మళ్లీ చేరే విషయంపై చర్చ జరిగిందనే ప్రచారం ఉంది. ఆ వార్తలను నిజం చేస్తున్నట్టే తాజాగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.