హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KrishnamRaju-Prabhas: కృష్ణంరాజు రాజకీయ వారసుడు అతడేనా.. ప్రభాస్ పొలిటికల్ ఇంట్రీ ఇస్తాడా..?

KrishnamRaju-Prabhas: కృష్ణంరాజు రాజకీయ వారసుడు అతడేనా.. ప్రభాస్ పొలిటికల్ ఇంట్రీ ఇస్తాడా..?

ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తాడా.

ప్రభాస్ రాజకీయాల్లోకి వస్తాడా.

కృష్ణంరాజు (Krishnam Raju) మరణం తరువాత ఆయన రాజకీయ వారసుడు ఎవరనే దానిపై రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. దీనికి తోడు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Central Minister Rajnath Singh) స్వయంగా హీరో ప్రభాస్‌ (Actor Prabhas) ని కలిసి ముచ్చటించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) నటుడు గానే కాక రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కేంద్ర మంత్రిగా, బీజేపీ (BJP) నాయకుడిగా కృష్ణం రాజు తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏ.పీలో బీజేపీ ప్రజాదరణ కలిగిన అతి కొద్దిమందిలో కృష్ణంరాజు ఒకరు. ఆయన మరణం తరువాత ఆయన రాజకీయ వారసుడు ఎవరనే దానిపై రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. దీనికి తోడు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Central Minister Rajnath Singh) స్వయంగా హీరో ప్రభాస్‌ (Actor Prabhas) ని కలిసి ముచ్చటించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ప్రభాస్ స్వయానా కృష్ణంరాజు తమ్ముడు కొడుకు అవడం.., కృష్ణంరాజుకు కుమార్తెలు తప్ప కుమారులు లేక పోవడంతో అందరి దృష్టి ప్రభాస్‌పైనే పడింది.

  ఐతే సినిమా రంగంలో కృష్ణంరాజు నట వారసుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ పీక్స్‌లో ఉంది. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనకోవడంపై ఆసక్తికర చర్చజరుగుతోంది. అసలు ప్రభాస్‌కు పాలిటిక్స్ అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అని అసలే ఏ.పీలో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడుతున్న బీజేపీ.., కృష్ణం రాజు కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందనడంలో సందేహం లేదు. అందుకే కృష్ణం రాజు మరణం తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించటానికి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రభాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీజేపీ కృష్ణం రాజు కుటుంబానికి అండగా ఉంటుందని, తమ కుటుంబం కూడా ఏప్పటిలాగే బీజేపీ వెంటే ఉండాలని కోరినట్లు విశ్వసనీయ సమిచారం.

  ఇది చదవండి: 2024 ఎలక్షన్స్‌ టార్గెట్‌..! గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రజా పోరుయాత్ర..!

  ఐతే ప్రస్తుతం పెదనాన్న మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తమ కుటుంబం పెదనాన్న రాజకీయ వారసునిగా ఎవరిని ఉంచాలనే ఆలోచన చేయలేదని, తాము అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తెలియ జేస్తామని రాజ్‌నాథ్‌కి ప్రభాస్ చెప్పినట్లు టాక్. ఐతే ప్రభాస్ సోదరుడు ప్రబోధ్‌ని కృష్ణం రాజు రాజకీయ వారసుడిగా పరిచయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. అన్నదమ్మలిద్దరూ ఒకరు సినిమా వారసత్వాన్ని మరొకరు రాకీయ వారసత్వాన్ని అందుకుని తమ పెదనాన్న కీర్తిప్రతిష్టలు మరింతగా పెంచాలని కుటుంబంలో ఓ నిర్ణయానికి వచ్చారని కృష్ణం రాజు సన్నిహితుల సమాచారం.

  మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కృష్ణంరాజు సొంత నియోజకవర్గమైన నర్సాపురంలో ఆయన కుటుంబం నుంచే ఒకర్ని బరిలో దింపితే ఎలా ఉంటుందని బీజేపీ నేతలు యోచిస్తున్నారట. ఎలగూ జనసేనతో పొత్తులో ఉన్నాం కాబట్టి.. ఆ ప్రాంతం పవన్ కల్యాణ్‌కు కూడా సొంతప్రాంతమే. ఈ రెండు సమీకరణాల వల్ల నర్సాపురంలో విజయం సాధించవచ్చనేది కమలనాథుల లెక్కగా ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Krishnam Raju, Prabhas

  ఉత్తమ కథలు