Home /News /andhra-pradesh /

AP POLITICS WILL PM MODI AND AMIT SHAH SHOW GRACE ON ANDHRA PRADESH BJP LEADERS REGARDING RAJYA SABHA SEATS AK

AP| BJP: ఏపీ నేతలకు మోదీ, అమిత్ షా కరుణిస్తారా ? వారి ఆశలు ఫలిస్తాయా ?

మోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

మోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

AP| BJP: ఏపీలో బీజేపీ రాజకీయంగా పుంజుకుంటున్న దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులు ఎంపిక ఖరారైపోయింది. అటు తెలంగాణ, ఇటు ఏపీలోని టీఆర్ఎస్, వైసీపీ నేతలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే తెలంగాణ, ఏపీలోని బీజేపీ నేతలు తమకు రాజ్యసభ ఛాన్స్ వస్తుందా ? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా బలపడాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ..ఇక్కడ తమకు బలంగా లేకపోయినా.. ఇక్కడి నేతలను యూపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ఒకరికి యూపీ నుంచి పెద్దల సభకు పంపడం ఖాయమనే సంకేతాలు తెలంగాణ నేతలకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందనే విషయం తెలియడానికి మరికొద్ది రోజుల సమయం పడుతుందని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి(Andhra Pradesh) చెందిన బీజేపీ నేత ఒకరిని రాజ్యసభకు పంపేందుకు బీజేపీ హైకమాండ్ సుముఖంగా ఉందనే చర్చ అక్కడి బీజేపీ నేతల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అదే జరిగితే.. ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఏపీ నుంచి రాజ్యసభకు(Rajya Sabha) ఒకరికి ఛాన్స్ వస్తే.. పురంధేశ్వరి, సుజనా చౌదరిలో ఒకరికి అవకాశం ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ జాతీయ నేతలు లెక్కలు ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఏపీలో బీజేపీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. ఆయన ఉండగానే.. ఏపీ నుంచి బీజేపీ మరొకరికి అవకాశం ఇస్తుందా ? అనే చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. అక్కడి వారికి రాజ్యసభకు పంపడం ద్వారా రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది.

    Atmakur By Election: ఏపీలోని ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

    MLC Ananta babu Suspension: ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ

    అయితే ఏపీలో బీజేపీ రాజకీయంగా పుంజుకుంటున్న దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీంతో తమకు రాజకీయంగా ప్రయోజనం లేని ఏపీ నుంచి బీజేపీ పెద్దల ఎవరినైనా రాజ్యసభకు ఎంపిక చేస్తారా ? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే బీజేపీ పెద్దలు ఇందుకు భిన్నమైన లెక్కలు వేసుకుని ఏపీ బీజేపీ నేతకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే.. ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తే.. సామాజిక సమీకరణాలు తెరపైకి వస్తాయి. ఆ రకంగా ఛాన్స్ ఎవరికి ఉంటుందనేది ఊహించడమే కష్టమే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు