హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఏపీలో మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? టీడీపీ -జనసేన పొత్తు ఫిక్స్ అయితే బీజేపీ స్టాండ్ ఏంటి?

AP Politics: ఏపీలో మూడు పార్టీల పొత్తు సాధ్యమేనా..? టీడీపీ -జనసేన పొత్తు ఫిక్స్ అయితే బీజేపీ స్టాండ్ ఏంటి?

మోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

మోదీ, అమిత్ షా (ఫైల్ ఫోటో)

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడన్నది పూర్తి క్లారిటీ లేకపోయినా.. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టే.. మరి బీజేపీ ఆ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం ఉందా? లేదా..? మరి ఆ పార్టీ స్టాండ్ ఏంటి..?

ఇంకా చదవండి ...

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సమరానికి సై అంటున్నాయి. ఈ నెల 11 నుంచి గడపగడపకు వైసీపీ (YCP) పేరుతో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. పాజిటివ్ ఓటు.. సంక్షేమ పథకాల పబ్లిసీటి.. సీఎం జగన్ (CM Jagan)కు ఉండే క్రేజ్ తమని గెలిపిస్తాయనే నమ్మకంతో అధికార పార్టీ అడుగులు వేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఓట్లు చీలకుండా ఉండాలి అంటే.. ఇతర పార్టీల పొత్తు అవసరం అని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా జనసేన (Janasena)తో పొత్తు ఉంటే.. వైసీపీ (YCP)ని ఓడించవచ్చు అన్నది టీడీపీ (TDP) లెక్క. అందుకే ఓ అడుగు ముందుకు వేసిన చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) త్యాగానికి కూడా సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు.. అయితే జనసేన  సైతం ఇదే అభిప్రాయంతో ఉంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే నష్టం తప్పదని అంచనాకు వచ్చింది.. అందుకే పొత్తులు అవసరం అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భావిస్తున్నారు. అందుకు చర్చలు జరగాలి అంటూ.. టీడీపీకి ఆఫర్ ఇచ్చారు.. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగుతుంది అంటూ.. ట్వీస్ట్ ఇచ్చారు.. ఇక్కడే చిక్కుముడి వీడడం లేదు.. టీడీపీతో పొత్తుకు బీజేపీ నై అంటోంది.. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. ఇటు పవన్ టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు సై అంటుంటే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నో అంటున్నాడు. మర దీనిపై జాతీయ నేతల స్టాండ్ ఏంటి..?

కేంద్ర బీజేపీ పెద్దల్లోనూ చంద్రాబాబును దూరం పెట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. గత అనుభవాలతో చంద్రబాబుతో కలిసి వెళ్లడం మంచిది కాదని.. కేంద్రం మనసులో మాట అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కూడా అదే స్టాండ్ తో ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కాదు.. శాశ్వత శత్రువులు కాదు.. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ద్వయం.. గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్నైనా అమలు చేయడంలో దిట్టలు.. స్నేహితులను దూరం చేసుకుంటారు.. శత్రువులను దగ్గర చేసుకుంటారు.. కాబట్టి టీడీపీ విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చనది మెజార్టీ అభిప్రాయం. అంతేకాదు.. బీజేపీ జాతీయ నేతలు కొందరితో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న కీలక నేతలకు చంద్రబాబుతో మంచి బాండ్ ఉంది.. వారు కూడా ఈ విషయంలో మోదీ, అమిత్ షాలను ఒప్పించే అవకాశాలు లేకపోలేదు.

ఇదీ చదవండి :  టీడీపీ-జనసేన కలిస్తే ఏపీలో లెక్కలు ఇవే.. వైసీపీ ఓటమి తప్పదంటున్న రెబల్ ఎంపీ

అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీతో పొత్తు విషయంలో.. ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అయితే బీజేపీలో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్నాయి. అందులో చీప్ సోము వీర్రాజు.. రాజ్యసభ సభ్యులు జీవీఎఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు మాత్రమే.. టీడీపీతో పొత్తును వ్యతిరేకించే అవకాశం ఉంది.. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు సుజనా, సీఎం రమేష్ లాంటి వారు తమ లాబీయింగ్ వదిలే ప్రసక్తే ఉండందు.. చంద్రబాబు వారి ద్వారా ఇప్పటికే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారనే ప్రచారం కూడా ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్, మాధవ్, కామినేని లాంటి వారు.. కచ్చితంగా టీడీతో పొత్తుకే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక ఇటీవల జరుగుతున్న పరిణమాలు చూస్తే.. దగ్గుబాటి పురందేశ్వరి సైతం పొత్తుకు ఒప్పుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.. ఇలా మెజార్టీ అభిప్రాయం తీసుకుంటే.. బీజేపీ పెద్దలు పొత్తుకు ఒప్పుకునే అవకాశమే ఎక్కువ వీరికి తోడు.. పవన్ కళ్యాణ్ పట్టు పడితే.. కచ్చితంగా మోదీ, అమిత్ షా మనసు మారే అవకాశం లేకపోలేదు.. అందుకే ఏ రకంగా చూసినా ఈ మూడు పార్టీల పొత్తుకే ఎక్కువ ఛాన్స్ ఉంది..

ఇదీ చదవండి :  ఈ నగరానికి ఏమైంది..? మొన్న చాక్లెట్లు.. ఇప్పుడు మత్తు ఇంజక్షన్లు..

సీఎం జగన్ ఎలాంటి వ్యూహంతో వెళ్తారు అన్నదే ఇక్కడ కీలకం.. ముఖ్యంగా ఆయన పాజిటివ్ ఓట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక వ్యతిరేక ఓటును ఎంత వరకు ఆపగలుగుతారన్నదానిపై గెలుపు ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికకు.. వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం.. దీనిపై త్వరలోనే బీజేపీ పెద్దలు జగన్ ను కలిసే అవకాశం ఉంది.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలి అంటే.. టీడీపీ పొత్తు లేకుండా ఉండాలని జగన్ కండిషన్ పెడితే.. అప్పుడు బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ఎందుకంటే ప్రస్తుతం అన్ని విషయాల్లో జగన్ కేంద్రానికి మద్దతుగానే నిలుస్తూనే వస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో జగనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని బీజేపీకి సంకేతాలు అందితే.. టీడీపీని దూరం పెట్టి.. జగన్ తో ఇవే సంబంధాలు కొనసాగించవచ్చు.. ఒకవేళ జగన్ కు వ్యతిరేకంగా నివేదికలు వస్తే.. టీడీపీతో కలిసి వెళ్లే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Amit Shah, Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Narendra modi, Pawan kalyan

ఉత్తమ కథలు