Home /News /andhra-pradesh /

AP POLITICS WILL PAWAN KALYAN GIVE CLARITY ON CONTESTING ONCE AGAIN IN BHIMAVARAM OF ANDHRA PRADESH AK

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈసారి తేల్చుతారా ?.. వైసీపీ, టీడీపీల్లోనూ ఆసక్తి

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలు జనసేనకు చావోరేవో లాంటివి అన్నట్టుగా ఉన్నారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒంటరిగా పోటీ చేసినా.. లేక టీడీపీతో కలిసి బరిలోకి దిగినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం.

ఇంకా చదవండి ...
    గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేన.. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోతే.. అది పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలు జనసేనకు చావోరేవో లాంటివి అన్నట్టుగా ఉన్నారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒంటరిగా పోటీ చేసినా.. లేక టీడీపీతో కలిసి బరిలోకి దిగినా.. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించాలన్నది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లక్ష్యం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే జనంలోకి వెళుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసకునేందుకు జనవాణి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంపై రాజకీయవర్గాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ.. ఈ నెల 17న జనసేన (Janasena) నిర్వహించనున్న జనవాణి కార్యక్రమానికి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఇందుకు అసలు కారణం ఈ కార్యక్రమాన్ని భీమవరంలో(Bhimavaram) నిర్వహించడమే. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే ఆయన కచ్చితంగా గెలుస్తారని భావించిన భీమవరంలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.



    భీమవరంలో ఒకసారి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారా ? అన్నది దానిపై మాత్రం స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్‌కు దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం, అవసరం కూడా రాలేదు. అయితే ఇప్పుడు స్వయంగా భీమవరంలో జరగనున్న జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రానుండటంతో.. ఇక్కడ ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. అధికార వైసీపీ మరోసారి భీమవరం సీటు నిలుపుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందనే వాదన వినిపిస్తోంది.

    EWS Certificate: ఏపీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందడం ఎలా..? ఎలా అప్లై చేయాలి..? పూర్తి వివరాలివే..!

    AP Weather Update: ఏపీని వదలని వాన.. 15 జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక

    అయితే పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరంలో పోటీపై స్పష్టమైన ప్రకటన చేస్తారా ? లేక ఆ దిశగా పరోక్షంగా సంకేతాలు మాత్రమే ఇస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే జనసేన జనవాణి కార్యక్రమం మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా నిర్వహించినా.. భీమవరంలో జరగబోయే ఈ కార్యక్రమం మాత్రం జనసేన కార్యకర్తతో పాటు వైసీపీ, టీడీపీల్లోనూ ఉత్కంఠ రేపుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరి.. భీమవరం విషయంలో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్.. మరోసారి అదే మౌనాన్ని కొనసాగిస్తారా ? లేక అందరికీ ఫుల్ క్లారిటీ ఇస్తారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Bhimavaram, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు