Home /News /andhra-pradesh /

AP POLITICS WILL NTR NARA FAMILY RAEAY TO GET TO GEDHAR WHAT ABOUT JR NTR NGS

Nara-NTR Family: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు భారీ స్కెచ్.. ఏకతాటిపై ఎన్టీఆర్ కుటుంబం..! Jr NTR పరిస్థితి ఏంటి?

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

Nara-NTR Family: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడకు చాలా కీలంక కానున్నాయి. అందుకే గెలుపు కోసం అనేక వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అన్ని కుదురితే పొత్తుల ద్వారా ముందుకు వెళ్లాలనని.. లేదంటే సింగిల్ గా గెలవడానికి ఏం చేయాలి అన్నదానిపైనా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన వ్యూహం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Chandrababu-NTR Family: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికలను చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఓ మెట్టు దిగి.. వన్ సైడ్ లవ్ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కన్ను గీటారు.. ఆ వెంటనే పవన్ సైతం.. జగన్ ఓడించేందుకు త్యాగాలు తప్పవు అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడంతో.. అంతా పొత్తు పక్కా అనుకున్నారు. ఆ తరువాత నుంచి పవన్ వరుసగా స్వరం మారుస్తూ వస్తున్నారు. ప్రతిసారి తానే ఎందుకు త్యాగాలు
  చేయాలని టీడీపీని ప్రశ్నించారు. రోజుల వ్యవధిలోనే మరో మాట చెప్పారు.  టీడీపీ ముందు మూడు ఆప్షన్లు కూడా పెట్టారు. తాజాగా తనకు ఎవరితోనూ పొత్తు లేదని.. ప్రజలతోనే పొత్తు అంటూ మాట మార్చారు. ఇలా జనసేన అధినేత పవన్ టీడీపీని సైతం గందగోళపరిచారు. ఇలా పొత్తులపై అవరోధాలు కనిపించడంతో.. మరో వ్యూహానికి చంద్రబాబు తెరలేపారు అంటూ ప్రచారం జరుగుతోంది. అది ఏంటంటే..? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరినీ ఏక తాటిపైకి తెస్తున్నట్టు ప్రచారం ఉంది.

  వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ఆయనే పార్టీలో సీనియర్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు టీడీపీ ఆవిర్భవించిన చాలా నాళ్లకు ఎన్టీఆర్ గూటికి చేరారు. అప్పటికే వెంకటేశ్వరరావు పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ చంద్రాబు నాయుడు వచ్చిన అనతి కాలంలోనే తన మార్కు చూపించారు. మొత్తం పార్టీని టేకోవర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ను తోసిరాజని కుటుంబసభ్యుల సహకారంతో పార్టీని హైజాక్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తనయుల నుంచి తోడళ్లుల్లు వరకూ అందర్నీ లక్ష్మీపార్వతిని బూచీగా చూపించి పార్టీని తన చేతుల్లోకి లాక్కున్నారు.  చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ పగ్గాలు వచ్చిన తరువాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరూ దూరమయ్యారు. లేదు చంద్రబాబే
  దూరం పెట్టారన్న టాక్ ఉంది. అందుకే చెట్టుకొకరు..పుట్టకొకరు అయిపోయారు. తోడల్లుడు వెంకటేశ్వరరావుకు పార్టీలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ బాట పట్టాల్సి వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా, భార్య పురందేశ్వరి ఎంపీగా గెలిచారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. దశాబ్దాలు గడుస్తున్నా చంద్రబాబుతో వారు కలిసింది తక్కువే. కేవలం కుటుంబ ఫంక్షన్లలో మాత్రమే కలుసుకుంటున్నా ఎడముఖం పెడముఖమే. అలాంటి ఆయన.. దగ్గుబాటి ఆస్పత్రిలో న్నారని తెలియడంతో హుటాహుటిని ఆస్పత్రికి వెళ్లి.. దగ్గుబాటిని పరామర్శించారు.

  ఇదీ చదవండి : నేను విన్నాను నేను ఉన్నాను అంటున్న ఏయూ స్టూడెంట్.. అచ్చం జగన్ ను దింపేస్తున్నాడుగా.. మీరే చూడండి

  విషయం తెలుసుకున్న చంద్రబాబు నేరుగా ఆస్పత్రికి వెళ్లి తోడల్లుడును పరామర్శించారు. చాలాసేపు అక్కడే గడిపారు. పురందేశ్వరి సైతం అక్కడే ఉన్నారు. అయితే తాను బలహీనమైన ప్రతీసారి మాత్రం చంద్రబాబు దూరమైన వారిని దగ్గర చేసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసమేనన్న మాటలు నపిస్తున్నాయి. దగ్గుబాటి కుటుంబాన్ని మరోసారి దగ్గర చేసుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారట. వీలైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుమారుడ్ని రాజకీయంగా యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి దగ్గుబాటి దంపతులు కూడా ఒప్పుకున్నారని సమచారం. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య సన్నిహిత్యం బాగా పెరిగిందని టీడీపీ వర్గాల టాక్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తప్ప.. మొత్తం కుటుంబమంతా చంద్రబాబు కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నారట.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Jr ntr, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు