హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Yuvagalam: యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

Yuvagalam: యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

పాదయాత్ర లోకేష్ ను సీఎం చేస్తుందా..?

పాదయాత్ర లోకేష్ ను సీఎం చేస్తుందా..?

Nara Lokesh: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాద యాత్రలకు మంచి సెంటిమెంట్ ఉంది. పాదయాత్ర చేసిన.. ప్రతి కీలక నేతలు అంతా సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ వీరంతా పాద యాత్రల ద్వారా సీఎం అయిన వారే.. మరి ఆ సెంటిమెంట్ లోకేష్ కు వర్కౌట్ అవుతుందా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kuppam, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

Yuva Galam:  తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాద యాత్ర ప్రారంభమైంది. యువగళం (Yuvagalam) పేరుతో ఈ రోజు చిత్తూరు జిల్లాలోని టీడీపీ కంచుకోట కుప్పం నుండి ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు వందల రోజుల పాటు.. నాలుగు వేల కిలోమీటర్ల పాటు ఆయన పాద యాత్ర కొనసాగనుంది. చివరికి  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్ఛాపురంలో ఈ పాద యాత్ర ముగియనుంది.  అయితే   "యువగళం" (Yuvagalam)  పేరుతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా.. గంలో పాదాయాత్ర చేసిన నాయకులను సీఎం కుర్చీ వరించింది. మరి లోకేష్ కు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా..?

ఇతర నేతల పాదయాత్రతో పోల్చుకుంటే ఈ పాదయాత్రకు కొంచెం తేడా కనిపిస్తోంది. జీవో నెంబర్ 1 అడ్డుపెట్టుకుని లోకేష్ పాదయాత్రను.. ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్ననం  చస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో తామూ ఇలానే వ్యవహరిస్తే జగన్ తన పాదయాత్ర కొనసాగేదా..? ఆయన సీఎం అయ్యేవారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆంక్షలు ఎన్ని ఉన్నా తగ్గేదే లే అంటున్నాయి టీడీపీ వర్గాలు.  రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలోకి తీసుకు వెళ్ళడమే  ప్రధాన ఎజెండాగా లోకేష్ చేపట్టిన పాయాత్ర టీడీపీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. గడచిన నాలుగేళ్ళుగా టీడీపీ శ్రేణులపై జరిగిన దాడులు, కేసులు, ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి  అక్రమాలు, వైఫల్యాలను ఎండగడుతూ లోకేష్ యాత్ర సాగనుంది.

ఇదీ చదవండి : అరచేతిలో ఇల వైకుంఠం.. టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం..? ఎన్ని ప్రయోజనాలంటే?

"యువగళం" కోసం లోకేష్ గడచిన సంవత్సర కాలంగా ఎంతో కృషిచేశారు. పాదయాత్ర కోసం లోకేష్ తన ఆహార్యాన్ని ఎంతగానో మెరుగు పరచుకున్నారు. అంతేకాదు గత కొంత కాలంగా లోకేష్ ప్రసంగాలలో వచ్చిన పరిణితి ప్రత్యర్ధులను సైతం ఆశ్ఛర్యానికి గురిచేస్తోంది. గతం లోకేష్ ప్రసంగాలలో తప్పులు దొర్లడం పరిపాటిగా ఉండేది.ఐతే ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకోవడమే కాక  అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో సరికొత్తగా ముందుకు వస్తున్నారనేది తెదేపా వర్గాల మాట.

ఇదీ చదవండి: వస్తున్నా మీ కోసం అంటున్న లోకేష్.. పాదయాత్ర ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

ఏ నాయకుడికైనా ఇంతటి భారీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో పట్టుదల, శ్రమ, ఓర్పు తో కూడుకున్న వ్యవహారం. దానితో పాటు గత ప్రభుత్వంలో తాము చేసిన తప్పొప్పులు సరిదిద్దుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలపై సమర్ధవంతంగా ప్రజలని ఒప్పించడం లో లోకేష్ సక్సెస్ సాధిస్తే ఫలితం ఉంటుంది. దీనికి తోడు పార్టీలో వ్యవస్తాగత లోపాలు, పార్టీ  మేనిఫెస్టో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టబోవు ప్రణాలికలు కూడా ప్రజలకు వివరించగలిగితే మరింత లబ్ధి చేకూరుతుందని టీడీపీ అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి : హిందూపురంలో బాలయ్యకు తప్పిన ప్రమాదం.. అసలు ఏం జరిగిందో చూడండి..?

సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2003 లో ప్రజా ప్రస్థానం పేరుతో సుధీర్గ పాదయాత్రకు నాంది పలికిన దివంగత నేత డా॥వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుండి మొదలు పెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో  ముగించారు.68 రోజులపాటు 1500 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో ఆయన అనేక హామీలను ప్రజలకు ఇవ్వడం జరిగింది.వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ప్రజలలో రాజశేఖరరెడ్ది పట్ల నమ్మకాన్ని పెంచాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించడమేగాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు.

ఇదీ చదవండి : ఉద్దానంలో మారుతున్న పరిస్థితి.. నష్టాల నుంచి లాభాల్లోకి రైతులు.. ఏం చేశారంటే?

రాజశేఖర రెడ్డి మరణానంతరం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత  తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా.చంద్రబాబునాయుడు 2012 సంవత్సరంలో  వస్తున్నా.. మీకోసం పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం నుండి మొదలు పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి వరకు సుమారు 2800 కిలోమీటర్లమేర సాగింది. 2009 రెండో సారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు అందుకే ఈ యాత్రకు వస్తున్నా..మీకోసం అని పేరుపెట్టారు. ఆ తరువాత  2014 లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

ఇదీ చదవండి : వైభంగా వసంత పంచమి వేడుకలు.. జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసాలు.. ప్రత్యేకత ఏంటంటే..?

ఆయన ప్రత్యర్ధిగా అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష  వై.ఎస్.జగన్నోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరు తో 2017 సంవంత్సరంలో కడప జిల్లా ఇడుపులపాయ నుండి మొదలు పెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సంవత్సరకాలంలో దాదాపు 3650 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.ఈ యాత్ర ద్వారా జగన్ దాదాపు రెండు కోట్ల మందిని ప్రత్యక్షంగా కలిశారని ఒక అంచనా. అప్పటి వరకూ అక్రమ ఆస్తులకేసులు, అవినీతి ఆరోపణలతో సతమతమౌతున్న జగన్ కు ప్రజాప్రస్థానం పాదయాత్ర తో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. 151 సీట్లతో సీఎం అయ్యారు.

మరి లోకేష్ పాద యాత్ర  ఆయన్ను సీఎం చేయిస్తుందా.. ఆ సెంటిమెంట్ కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర తీవ్ర చర్చనీయాంశమైంది.. మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh

ఉత్తమ కథలు