విశాఖ నుంచి ఏపీ ప్రభుత్వం పరిపాలన సాగించనుందని.. తాను కూడా విశాఖకు తరలివస్తానని గతంలో సీఎం జగన్ చెప్పారు. ఏప్రిల్ నుంచే విశాఖ నుంచి ఏపీ ప్రభుత్వం(Ap Government) పరిపాలన సాగిస్తుందని సంకేతాలు ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయంలో జగన్ తన అభిమతాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన మంత్రివర్గం సమావేశంలో మంత్రులకు తెలిపారు. జులైలో విశాఖ (Visakhapatnam) వెళుతున్నామని మంత్రులకు వివరించారు. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు పలు సందర్భాల్లో తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏదేమైనా.. సీఎం జగన్(YS Jagan) సాధ్యమైనంత తొందరగా విశాఖకు తరలిపోవడం ఖాయమని చర్చ జరిగింది. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశంలో విశాఖకు వెళ్లే ముహూర్తాన్ని సీఎం జగన్ మార్చినట్టు తెలుస్తోంది.
జులైలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నామని ఆయన మంత్రులకు చెప్పడంతో.. ఇందుకు మరో మూడు నెలల సమయం ఉన్నట్టు క్లారిటీ వచ్చింది. కేబినెట్ భేటీలో మరిన్ని అంశాలపై జగన్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలవాలని ఆయన అన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని మంత్రులకు తెలిపారు. మంత్రివర్గంలో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు.
అయితే ఏపీ రాజదానికి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం వల్లే సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లే అంశంపై మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించిన కేసులు మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణను ఫిబ్రవరి 23వ తేదీన సుప్రీంకోర్టులో చేపట్టాల్సి ఉంది. అమరావతి కేసుల అంశాన్ని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు.
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
Tirumala: ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో.. భక్తులకు వేగంగా గదుల కేటాయింపు..!
కోర్టుకు హోలీ సెలవుల అనంతరం ఈ కేసులను విచారణ జాబితాలో చేర్చాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. చివరకు మార్చి 28వ తేదీన కేసుల విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. విచారణ జాబితాలో తొలి కేసుగా తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరగా.. ఇప్పటికే రెండు కేసులు తీసుకున్నామని మూడో కేసుగా విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణ మార్చికి వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వం విశాఖకు తరలి వెళ్లే అంశంపై మరికొంత సమయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.