Nagababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలకు మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దూరంగా ఉన్నా..? ప్రత్యేక్షంగా బరిలో ఉన్నా.. ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు.. అయితే చాలాకాలంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. అదే సమయంలో జనసేన (Janasena) అధినేత తమ్ముడు పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుదనే చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ (CM Jagan) తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల సినిమా పెద్దల సమస్యల విషయంలో ఆయనే ముందుండి ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్యవర్తిత్వం వ్యవహరించారు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఓ వైపు సొంత తమ్ముడు పవన్.. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. చిరంజీవి ప్రశంసలు కురిపించడంతో.. మెగా అభిమానులు కన్ఫ్యూజ్ లో పడ్డారు.. అన్నయ్య మద్దతు తమ్ముడికి లేదా అని కలరవ పడ్డారు. దీంతో చిరంజీవి ఏం అనుకుంటున్నారు అన్నదానిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తన సోదరుడు చిరంజీవి మద్దతు జనసేనకు ఉంటుందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు (Nagababu). పార్టీ తరఫున ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటిస్తున్న నాగబాబు పార్టీకి సంబంధించి కీలక అంశాలను ప్రకటించారు.
చిరంజీవి తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారా. జనసేనకు ఆయన మద్దతు ఏ విధంగా ఉంటుంది. కొంత కాలంగా ఈ ప్రశ్నల పైన మెగా ఫ్యాన్స్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చ సాగుతూనే ఉంది.. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు జనసేన కోసం క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో జనసైనికులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ (Maga Fans) అంతా జనసేనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎదురవుతున్న ప్రశ్నలకు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అన్నయ్య చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ గురించి చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి : యోగాను కెరీర్ గా మార్చుకోవాలి అనుకుంటున్నారా? త్వరపడండి.. గడవు ముగుస్తోంది..!
తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లోకి రారని, మద్దతు జనసేనకు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి దృష్టి ప్రస్తుతం సినిమాలమీదే ఉంది. ఆయన రాజకీయాల్లోకి రారన్నారు. అలాగే పొత్తుల విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దోచుకున్నాయని ఆరోపించారు. విశాఖలోని రుషికొండను తవ్వేస్తున్నారు. చారిత్రక వారసత్వాన్ని దెబ్బతీస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై ప్రతి చిన్న అంశానికీ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. దీనిపై తమ లీగల్ సెల్ దృష్టి పెడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ ప్రభుత్వాన్ని దించడం తప్ప మరో మార్గం లేదంటూ.. పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పరోక్ష సంకేతలు ఇచ్చారు. . ఉత్తరాంధ్ర ప్రజల వలసల నిరోధానికి పవన్ కల్యాణ్ వద్ద ప్రణాళిక ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena, Mega brother nagababu, Megastar Chiranjeevi, Powe star pawan kalyan, Vizag