ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో (Visakhapatnam) పర్యటించిన చంద్రబాబు.. విశాఖకు అభివృద్ధి కావాలా లేక రాజధాని కావాలా అని అన్నారు. అమరావతిని రాజధాని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు (Chandrababu Naidu) మరోసారి స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్పై(YS Jagan) చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐరన్ లెగ్ సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అన్యాయం మనం ఎన్నడూ చూడలేదని ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ (PM Modi)అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని ఎద్దేవా చేశారు. తన పోరాటం తన కోసం కాదని.. మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. తన కాన్వాయ్ నిలిపివేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు.
తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని టీడీపీ అధినేత హెచ్చరించారు. జగన్ పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయో చూసుకున్నారని ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.