Home /News /andhra-pradesh /

AP POLITICS WILL LAGADAPATI RAJAGOPAL WILL RE ENTRY IN POLITICS WHY HE MEET YCP MLA NGS

Lagadapati: లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ..? పార్టీ ఏదీ.. పోటీ ఎక్కడ? ఆంధ్రా ఆక్టోపస్ క్లారిటీ

లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ

లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ

Lagadapati Rajagopal: రాజకీయ సన్యాసం తీసుకున్న ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారా.? ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు.? ఏ సీటు ఆయన కోరుకుంటున్నారు.. నాలుగేళ్ల పాటు అడ్రస్ లేని ఆయన.. ఇప్పుడు సడెన్ గా తెరపైకి ఎందుకు వచ్చారు..?

ఇంకా చదవండి ...
  Lagadapati Rajagopal: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆక్టోపస్ గా మాజీ ఎంపీ లగడ పాటి రాజగోపాల్ ( Lagadapati Rajagopal) ఒకప్పుడు ముద్ర వేసుకున్నారు.  గత ఎన్నికల్లో ఆయన అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. దీంతో రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అలాంటి ఆయన సడెన్ గా తెరపైకి వచ్చారు. రాజగోపాల్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారా..? 2019 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి.. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ లీడర్లతో ఎందుకు టచ్‌లోకి వచ్చారు.? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. నందిగామలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad)తో లగడపాటి సమావేశం అవ్వడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడిన వారిలో వసంత ఒకరు. ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయనపేరు తెరపైకి రాలేదు. ఇలాంటి సమయంలో లగడపాటి ఆయనతో భేటీ కావడం.. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు ఎవరికి మంత్రి పదవులు ఇచ్చారని ఆరాతీయడం.. లాంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు ఖమ్మం జిల్లా (Khamam District) కు కూడా లగడపాటి రావడం పలువురితో సమావేశమవడంతో.. మళ్లీ రాజకీయాల్లో వస్తారా అనే ప్రశ్న మొదలైంది..

  లగడపాటి అంటే.. ఒకప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో చక్రం తిప్పే నేతగా ఉండేవారు. తన చేష్టలు.. మాటలు.. సర్వేలతో నిత్యం జనాల్లో హాట్ టాపిక్ గా ఉండేవారు. ముఖ్యంగా 2014లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రేతో ఒక్కసారి ఏపీలో హీరో అయ్యారు ఆయన.. ఆ తర్వాత రాజకీయాలకు రాం రాం చెప్పేశారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు సైలెట్ అయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల టైంలో సడెన్‌గా ప్రత్యక్షమైన లగడపాటి.. సర్వేల పేరుతో హల్‌చల్‌ చేశారు. ఏపీలో టీడీపీ (TDP) గెలుపు ఖాయమని.. తెలంగాణ (Telangana)లో టీఆర్‌ఎస్‌ (TRS) ఓటమి పక్కా అని ఓ రిపోర్ట్‌ కూడా ఇచ్చారు.. తీరా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో ఆయనకు షాక్ తగిలింది.

  ఇదీ చదవండి : విధ్వంసం తరువాత సిద్ధమైన రామతీర్థం.. ఎలా ఉందో చూడండి

  ఊహించని ఫలితాలు రావడం.. తన అచంనాలు తారుమారు అవ్వడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. అలా మూడేళ్లుగా గప్‌చుప్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు సడెన్‌గా తెరపైకి వచ్చారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసి పొలిటికల్‌ హీట్‌ పెంచేశారు. దీంతో ఆయన పాలిటిక్స్‌లో రీఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యారా? అదే నిజమైతే వైసీపీ ఎమ్మెల్యేనే ఎందుకు కలిశారు? అంటే ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? టీడీపీ నుంచి విజయవాడకు ఛాన్స్ లేకపోవడంతో.. వైసీపీ నుంచి ట్రై చేస్తున్నారు..?

  ఇదీ చదవండి : విద్యార్థులను కూలీలుగా మార్చిన హెడ్ మాస్టర్.. తల్లితండ్రులకు తెలిసి ఏంచేశారంటే..?

  వసంతతో ఆయన కాసేపు రాజకీయాలు చర్చించడంతో కూడా అనుమానాలకు కారణం అవుతున్నాయి. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అంతేకాదు.. కాసేపు ప్రైవేట్‌గా చర్చించుకున్నారు. ఇప్పుడిదే పొలిటికల్‌గా హీట్‌ పెంచింది. ముఖ్యంగా ఆయన విజయవాడ నుంచి మళ్లీ పోటీ చేయాలి అనుకుంటున్నారని.. అందులో భాగంగానే వైసీపీ నుంచి టికెట్ ట్రేయాలని భావిస్తున్నారని.. అందుకే ఈ భేటీ అంటూ పొలిటికల్ సర్కిల్ టాక్. మరోవైపు తన కుమారుడికి వైసీపీ సీటు ఇప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం కూడా ఉంది. దీనిపై ఏమంటారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ లగడపాటి రాజగోపాల్‌తో ఏ రాజకీయ చర్చ జరగలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్టప్రసాద్. తమ ఇద్దరిది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని.. స్నేహితులుగా మర్యాద పూర్వకంగా కలిశామన్నారు. ఇద్దరి మధ్య కులాల ప్రస్తావన కూడా రాలేదని స్పష్టం చేశారు. పొలిటికల్ రీ ఎంట్రీపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు.

  ఇదీ చదవండి : స్వామికి మంత్రి రోజా సాష్టాంగ నమస్కారం.. సోషల్ మీడియాలో ట్రోల్స్

  తాను రాజకీయాలు చేసేందుకు రాలేదన్నారు. గరిడేపల్లిలో వివాహానికి హాజరయ్యానని తెలిపారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు. ఆయనతో ప్రత్యక్ష రాజకీయాలపై మాట్లాడలేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్‌ మెజారిటీ సాధించినా.. విజయవాడలో మాత్రం ఎంపీ సీటు కోల్పోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థి కేశినేని విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ.. ఓటమి తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బెజవాడ పార్లమెంట్‌ స్థానాన్ని కచ్చితంగా గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నవైసీపీ.. లగడపాటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Lagadapati, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు