హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: కొడాలి నానిని కొనసాగిస్తారా..? కలిసి వచ్చే అంశం అదే.. మైనస్ మార్కులు ఎన్ని?

AP Cabinet: కొడాలి నానిని కొనసాగిస్తారా..? కలిసి వచ్చే అంశం అదే.. మైనస్ మార్కులు ఎన్ని?

AP Cabinet: ఏపీ మంత్రి వర్గంలో ఎందరు మంత్రులు ఉన్నా.. కొడాలి నానాది ప్రత్యేక గుర్తింపు.. ఆయన ఒక్కసారి మైక్ అందుకుంటే.. టీడీపీ వాళ్లు చెవులు మూసుకోవాల్సిందే.. టీడీపీ అధినేతే చంద్రబాబు, లోకేష్ ల పరిస్థితి అయితే చెప్పాల్సిన అసవరం లేదు. ఆయన మంత్రిగా ఏం చేశారో అన్నది ఎప్పుడూ హైలైట్ అవ్వదు.. ఆయన నోటి నుంచి వచ్చే విమర్శల ద్వారానే వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మరి అలాంటి మంత్రికి కొనసాగింపు ఉంటుందా..? ఉండదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...

  AP Cabinet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి వర్గంలో త్వరలోనే మార్పులు ఉంటాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) క్లారిటీ ఇచ్చేశారు. కొందరు మంత్రులు తప్ప.. అందరూ తప్పుకోవాల్సిందే అని హింటు ఇచ్చారు. అయినా మంత్రి పదవుల నుంచి తప్పించిన వారికి.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు.. జగన్ ఆ మాటలు అన్న దగ్గర నుంచి కేబినెట్ లో కొనసాగేది ఎవరు.. వేటు పడేది ఎవరిపై అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ జూన్ లో మంత్రివర్గంలో మార్పులు చేస్తారని టాక్. మరి ఆ లిస్టులో ఉన్నది ఎవరు. జగన్ కు వీరాభిమానిగా చెప్పుకునే కొడాలి నాని (Kodali Nani)ఆ లిస్టులో ఉన్నారా..? సీనియారిటీ.. పనితీరు అని కాకుండా.. సామాజిక సమీకరణాలపైనే సీఎం ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. అంటే కులాల సమతుల్యత నేపథ్యంలోనూ కొందరిని కొనసాగించే వీలుందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కనే కొందరికి మైనస్ పాయింట్ లు ఉన్నా.. వారిని మంత్రివర్గం నుంచి తప్పించడం సాధ్యం కాదని మాత్రం అర్ధమవుతుంది. అధినేత చెబుతున్న కులాల సమతుల్యత అనే పాయింట్ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి లక్కీ ఛాన్స్ కాబోతోందా..?

  మొదట మొత్తం కాకున్నా 90 శాతం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఒకరిద్దరు మనిహా అంతా పదవులు వదులుకోవాల్సి వస్తుందని ప్రచారం జరిగింది. కొడాలి నాని కూడా మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుందని ఆయన అనుచురులు సైతం ఆందోళన చెందారు.. కానీ తాజాగీ సీఎం వ్యాఖ్యలు తరువాత.. కొడాలి నానిని మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈయన …చంద్రబాబు, లోకేష్ లపై ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో అందరికీ తెలిసిందే.. వైసీపీలో ఎందరో ఫైర్ బ్రాండ్ లు ఉన్నా.. వారందరినీ దాటి నెంబర్ వన్ గా మారారు కొడాలి నాని. ఎంతలా అంటే.. విమర్శలు చేయడంతో కొడాలి నాని.. ప్రభుత్వానికి పెద్ద సేఫ్టీ వాల్ మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఈయన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. దీనికి తోడు కులాల సమీకరణ కూడా నానికి కలిసి రావొచ్చు.

  ఇదీ చదవండి : ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కొత్త ఈక్వేషన్లు.. జగన్ అవసరం ఇక కేంద్రానికి లేనట్టేనా..?

  టీడీపీకి ఆయువు పట్టుగా భావించే కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా జగన్ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం.. ఆయన భారీ విగ్రహం ఏర్పాటు లాంటి నిర్ణయాలు.. అయితే ప్రస్తుతం వైసీపీలో ఆ సామాజిక వర్గం నుంచి ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు…కానీ ఎవరు కూడా కొడాలి నాని మాదిరిగా ఫైర్ బ్రాండ్ లీడర్లు అయితే కాదు. అంతా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా.. వారందరికీ కొడాలి నాని మాత్రమే దిక్కు అవుతున్నారు. దీంతో కుల సమీకరణల ప్రకారం.. ఆయన్ను కచ్చితంగా మంత్రిగా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది.

  ఇదీ చదవండి : అమ్మవారి సేవలో రోజా.. పూజలు అందుకేనా..? క్లారిటీ వచ్చిందా..?

  ఇక జూనియర్ ఎన్టీఆర్ (JR NTR), నందమూరి కుటుంబంతో సత్ససంబంధాలు కూడా ఆయనకు మరో ప్లస్.. నారా ఫ్యామిలీని దెబ్బ కొట్టాలి అంటే.. నందమూరిని దగ్గర చేసుకుంటే.. పెద్ద డ్యామేజ్ చేయొచ్చు.. అలా నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందర్ని తమవైపు తిప్పుకోవాలి అంటే కొడాలని నాని అసవరం తప్పదు. అందులోనూ ఓటర్లపై కచ్చితంగా ప్రభావితం చేయగల జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ తరపున ప్రచారం చేస్తే.. వైసీపీ కొంత డ్యామేజ్ తప్పకపోవచ్చు.. కానీ జూనియర్ రాజకీయాల్లోకి అప్పుడు రాకుండా అడ్డుకోవాలి అంటే.. కొడాలి నానిలాంటి వారి అవసరం ఎంతైనా ఉంటుంది.. ఇది కూడా ఆయనకు ప్లస్ పాయింటే అని చెప్పాలి..

  ఇదీ చదవండి : చిరంజీవిని వాడేసుకుంటున్న వైసీపీ.. రాజకీయ వ్యూహంలో భాగమేనా..?

  ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే.? జగన్ సన్నిహితుడు తలశిల రఘురాం ఎమ్మెల్సీగా ఉన్నారు..ఈయన కమ్మ వర్గానికే చెందిన నేత…పైగా కృష్ణా జిల్లా నేత. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి మంత్రి పదవి అంటే.. మరి ఈయనకు ఏమన్నా జగన్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే కొడాలిని పక్కన పెట్టాలి. కానీ అంత దూరం జగన్ ఆలోచన చేసే అవకాశాలే తక్కువ..

  ఇదీ చదవండి : ఏపీపై కమలం ఫోకస్.. వైసీపీ, టీడీపీ నుంచి త్వరలోనే చేరికలుంటాయన్న ఎంపీ

  ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్యాసినో ఇష్యూ కూడా కొడాలికి మైనస్ గా మారింది. ఏపీ వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. ప్రతిపక్షాలు నానిని ఈ విషయంలో టార్గెట్ చేస్తూ వచ్చాయి.. ప్రజల్లోకి కూడా ఈ అంశం బాగానే వెళ్లింది. మరి ఎంత వరకు ఈ అంశం ఆయనకు డ్యామేజ్ చేస్తుంది అన్నది చూడాలి.

  ఇదీ చదవండి : ఏపీలో ముందస్తు ఎన్నికలు.. బడ్జెట్ తో క్లారిటీ వచ్చిందన్న బీజేపీ

  రెండోది కొడాలి నాని బలం ఏదో.. అదే బలహీనత కూడా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకోవడం బలమే కాదు.. బలహీనత కూడా.. సాధారణంగా ఆయన విమర్శలు చేసినప్పుడు నోటికి అదుపు ఉండదు. ముఖ్యంగా చాలా అసభ్యకరంగా మాట్లాడుతారనే ముద్ర ఉంది. అందులోనూ ప్రజల్లో కాస్తో కూస్తో మంచి ఇమేజ్ ఉన్న చంద్రబాబును అనరాని మాటు అనడంలో కోడాలి నాని నోటికి బ్రేకులు ఉండవు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని చేసే విమర్శలతో కాస్త డ్యామేజ్ తప్పడం లేదు.. న్యూటరల్ ఓటర్లు..కొడాలి నాని వ్యాఖ్యలు చూసిన తరువాత వైసీపీకి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.. అందుకే ఆయన నోటిని అదుపు చేయాలి అంటే.. మంత్రి పదవి నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

  First published:

  ఉత్తమ కథలు