హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR vs TDP: టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం..! కారణం అదేనా?

Jr NTR vs TDP: టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం..! కారణం అదేనా?

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

చంద్రబాబు ,జూనియర్ ఎన్టీఆర్

Jr NTR vs TDP: యంగ్ టైర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా..? మళ్లీ చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేసే ఉద్దేశం ఆయనకు లేదా..? లేక.. తారక్ తో లోకేష్ కు థ్రెట్ ఉందని టీడీపీనే ఆయన్ను దూరం పెడుతోంది. అసలు ఈ గొడవకు కారణం ఇదేనా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Jr NTR vs TDP:  మొన్నటి వరకు ఆయనే పార్టీకి ఆశాకిరణం అన్నారు. తెలుగు దేశం (Telugu Desam) భవిష్యత్తు సీఎం ఆయనే అంటూ జపం చేశారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులే కాదు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం తారక్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలి అంటూ డిమాండ్ చేశారు. అది కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముందే ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలి అంటూ నినాదాలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం.. అవుననో.. కాదనో.. ఏదీ చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో అసలు ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉంటున్నారా..? లేక టీడీపీ ఆయన్ను దూరం పెడుతోందా అనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్  టీడీపీకి దూరంగానే ఉండాలి అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

  ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రస్తుతం ఓ రేంజ్ లో యుద్ధం నడుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుతో.. వైసీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ ఉంటుందని తెలుగు దేశం నేతలు ఆశపడ్డారు. కానీ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ తో పరిస్థితి తలకిందులైంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై స్పందించకపోయినా.. బాగుండేదని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ కంటే.. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నయం.. ఓపెన్ గా మాట్లాడరంటూ తారక్ ను తప్పు పడుతున్నారు.

  రెండు రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోల్ హోరెత్తుతున్నాయి. అయితే ఇదంతా టీడీపీనే చేస్తోందని జూనియర్ హార్డ్ కోర్ అభిమానులు మండిపడుతున్నారు. పార్టీ పెద్దలే తమ అభిమాన హీరోను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టిన నారా, నందమూరి కుటుంబ పెద్దలకు ఇప్పుడే ఎన్టీఆర్ పై ప్రేమ పెరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

  ఇలా గత రెండు రోజుల నుంచి ట్విట్టర్ లో తెలుగు దేశం వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ వార్ నడుస్తూనే ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి పరిస్థితి ఊహించలేదు.

  ఒక విషయంపై రెండు వర్గాలకు ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీతో కలిసి పని చేయాలి అని ఉంటే.. కచ్చితంగా వైసీపీ నిర్ణయాన్ని తప్పు పట్టేవారని.. అలా చేయలేదు కాబట్టి ఆయన టీడీపీతో కొనసాగే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

  దానికి తోడు ఇటీవల జరిగిన పరిణమాలు సైతం అలానే ఉన్నాయి. ఎందుకంటే ఓ వైపు తెలుగు దేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందని ఆశిస్తుంటే.. అనూహ్యంగా కేంద్ర హోం మంత్రి.. బీజేపీ నెంబర్ టు లీడర్ అమిత్ షా.. నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయాలపైనే చర్చ జరిగింది అంటూ ప్రచారం కూడా ఉంది. ఆయన్ను బీజేపీ తరపున పని చేయమని అమిత్ షా కోరినట్టు వార్తలు కోడై కూస్తున్నాయి.

  ఇదీ చదవండి: ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్.. అందరికీ పెన్షన్లు పెంపు.. ఎంతంటే?

  అప్పటి నుంచే ఎన్టీఆర్ వ్యవహారంపై టీడీపీ పెద్దలు నిఘా పెట్టినట్టు సమాచారం.. ఇలాంటి సమయంలో సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ గొప్ప వ్యక్తులే అంటూ తారక్ ట్వీట్ చేయడంతో.. ఇక భవిష్యత్తులో ఎన్టీఆర్ ను తమతో కలుపుకుని వెళ్లలేం అని టీడీపీ నేతలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Jr ntr, TDP

  ఉత్తమ కథలు