హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan-Jr NTR: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్-పవన్.. స్కెచ్ మామూలుగా లేదుగా?

Pawan-Jr NTR: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం.. ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్-పవన్.. స్కెచ్ మామూలుగా లేదుగా?

జూనియర్ ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్

జూనియర్ ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్

Pawan-Jr NTR: మెగా-నందమూరి కాంబినేషన్ ఎప్పుడూ క్రేజీనే.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్-రామచరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవి ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సిల్వర్ స్క్రీన్ పై కాదు.. రియల్ గానే అంతకుమించిన కాంబినేషన్ ను కళ్లరా చూసే అవకాశం దక్కనుందా..? ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుందా..? ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరపైకి వస్తోందా..? మెగా -నందమూరి (Mega Nandamuri) కుటుంబాలకు చెందిన సూపర్ స్టార్స్.. ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారా..? ప్రస్తుతం ఈ చర్చ హాట్ హాట్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన (Janasena) పార్టీకి అధినేతగా రాజకీయాల్లో.. సంచలనంగా మారాలని ప్రయాత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమిపాలైనా.. నిరాశ చెందకుండా.. ఇప్పుడు తన పార్టీనే అధికారంలోకి తేవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీతో కలిసే ఉన్నారు. ఎన్నికల నాటికి ఆయన బీజేపీతో కలిసి కొనసాగుతూనే టీడీపీని కలుపుకుంటారా.. లేకా.. బీజేపీని వదిలి టీడీపీతో వెళ్తారా.. అన్నది ఇంకా క్లారిటీ లేదు.

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఆయన బీజేపీ వీడే అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ ను ప్రచారానికి వాడుకోవాలని బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ మాట స్వయంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజే చెప్పారు. ఈ  ఇద్దరు ఒకే పొలిటికల్ ఎజెండాతో కలిసి పని చేయడం సాధ్యం అవుతుందా..? ఆ అవకాశాలు ఉన్నాయా ..? లేదా.. అది సాధ్యం అవుతుందా..?

  ప్రస్తుతం ఈ చర్చ ఆసక్తికరంగానే మారింది. ఇటీవల బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. కశ్చితంగా ఈ భేటీకి పొలిటికల్ అజెండా అయితే ఉంటుంది.

  ఇదీ చదవండి : భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?

  ఇదే అమిత్ షా గతంలో పవన్ కళ్యాణ్ ను కలిసారు. పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారు. అదే విధంగా జనసేన , బీజేపీ మద్య పొత్తు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కఛ్చితంగా పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ చరిష్మాను ఎంతో కొంత వాడుకునేందుకు వాళ్లు అడిగిన సీట్లు ఇచ్చి పొత్తు కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది.

  ఇదీ చదవండి : పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్

  అదే విధంగా తెలంగాణలో టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఓటు బ్యాంక్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తొంది బీజేపీ. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో 12 నుండి 15 నియోజకవర్గాల్లో బీజేపీకి అదనపు బలం తోడవుతుంది అని అంచనా వేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఇవేవో విటమిన్‌ టాబ్లెట్స్‌ అనుకుంటే పొరపాటే..! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

  అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు. తెలంగాణలో టీడీపీని లీడ్ చేయడం గానీ, లేక బీజేపీ తరపున ప్రచారం చేయడం గానీ ఈ రెండు అంశాల్లో ఏదో ఒక దానిపై చర్చ జరిగి ఉంటుంది. బీజేపీ ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ తో మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకోవాలని చూస్తొంది. పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు దాదాపు 99 శాతం ఖాయమే.

  ఇదీ చదవండి : భక్తులకు అలర్ట్.. గురువారం నుంచి పవిత్రోత్సవాలు.. సెప్లెంబర్ లో అన్ని ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే..

  తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి కలిస్తే.. కచ్చితంగా తారక్ తెరపైకి రావడం పక్కా అంటున్నారు. అదే జరిగితే మరి పవన్-తారక్ కలిసి కూటమి తరపున ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. తెలుగు దేశాన్ని కాదని ఎన్టీఆర్ బీజేపీకి ప్రచారం చేయడం కష్టమే..? అయితే టీడీపీ -జనసేన-బీజేపీ మూడు కలిసి ఎన్నికలకు వెళ్తే మాత్రం.. పవన్, తారక్ ఇద్దరూ ఒకే వేదిక మీద తప్పక కనిపించే అవకాశం ఉంటుంది.

  ఇదీ చదవండి : 2 రూపాయలకే చికెన్ రైస్.. అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఫుడ్.. ఎక్కడో తెలుసా? ప్రత్యేకత ఏంటి..?

  జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎన్నికల నుండే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా ..? లేక బీజేపీతో ప్రచారం చేస్తారా.. ?లేదా తెలంగాణలో టీడీపీ బాద్యతలు తీసుకుంటారా..? తనకు ఇప్పట్లో రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు తరువాత చూస్తానని ఆయన చెబుతూనే వస్తున్నారు. అదే సమయంలో తన రక్తం ఉన్నంత వరకు.. తాత స్థాపించిన పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. అలాగే తెలుగు దేశం పార్టీకి ఎప్పుడు అవసరం అనుకున్నా తాను తప్పక వచ్చి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన 2024 ఎన్నికల నాటికి ఈ కూటమి పొత్తు ఫిక్స్ అయితే.. కచ్చితంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Jr ntr, Pawan kalyan

  ఉత్తమ కథలు