హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

J.C.Diwakar Reddy: దివాకర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? అనుచరుల్లో మొదలైన సంబరాలు

J.C.Diwakar Reddy: దివాకర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? అనుచరుల్లో మొదలైన సంబరాలు

మళ్లీ యాక్టివ్ అయిన జేసీ

మళ్లీ యాక్టివ్ అయిన జేసీ

J.C.Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి.. రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు. రాష్ట్ర విభజన కు ముందు.. రాజకీయాలు శాసించారు. కానీ తరువాత కాలం కలిసి రాకో ఏమో అస్త్రసన్యాసం చేశారు. రాజకీయంగా ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో పెద్దాయన శకం ముగిసిందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ సడెన్‌గా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Anantapur, India

  J.C.Diwakar Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అత్యంత గుర్తింపు ఉన్న మాస్ లీడర్లలో జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) ఒకరు. రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్‌. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో పరిచయాలు ఉన్న నేత.. కను సైగతే నేతలను శాశించే స్థాయి ఉన్న నేత.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. మంత్రిగానూ పని చేశారు. ఆయన చుట్టూ ఎంత మంది ఉన్నా.. తన చేతలు.. మాట తీరుతో.. అటెన్షన్‌ తీసుకొస్తారు. సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ అని తేడా ఉండదు.. అధినేతను సైతం పట్టించుకోరు.. ఆయన ఏది చెప్పాలనకున్నారో అది షూటిగా చెప్పేసే తత్వం ఉంది. అనంతపురం జిల్లా (Anantapuram District) లో తనకు తిరుగులేని అనుకునే అలాంటి పెద్దాయనకు 2019 ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి. ఆయన కుటుంబానికి ఓటమి మింగుడు పడలేదు. అప్పటి నుంచి రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్టే కనిపించారు.. ఎక్కడా కార్యకర్తల సమావేశాలు.. పార్టీ కార్యక్రమాలు అంటూ సందడి చేయలేదు. దీంతో ఆయన పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేశారని భావించారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కడం వల్లో.. వేరే కారణం ఏదైనా ఉందో.. దివాకర్‌రెడ్డి కూడా మనసు మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఆయన యాక్టివ్‌ అయ్యారని అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.


  2019 ఎన్నికల తరువాత.. అంటే జగన్ మోహన్ రెడ్డి సీఎం (CM Jagan Mohan Reddy) గా బాధ్యతలు చేపట్టిన తరువాత.. జేసీ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy), ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి జైలుకెళ్లడం.. ఆర్థిక మూలాలపై వరస దెబ్బలు.. ఉక్కిరి బిక్కిరి చేశాయి. టైమ్‌ బ్యాడ్‌ అంటూనే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్‌ వస్తే కాంగ్రెస్‌ పాత మిత్రులతో మాటలు కలపడం.. అనుమతి లేకుండానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రగతిభవన్‌కు రావడం చేస్తూ వార్తల్లో నిలిచారు. తప్ప.. అంతకుమించి జిల్లాలోని టీడీపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. సొంత ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు.


  దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే తాడిపత్రిలో చురుకుగా ఉన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రే. జేసీ బ్రదర్స్ వ్యూహాలతోనే అక్కడ టీడీపీ గెలుపు సాధ్యమైంది. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో ప్రభాకర్‌రెడ్డికి ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. అయితే మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న దివాకర్‌రెడ్డి సైతం సీన్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనకు నియోజకవర్గంతోపాటు జిల్లాపై పట్టు ఉంది. ఎవరిని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అందుకే రంగంలోకి దిగారని చర్చ సాగుతోంది. ఓడినచోటే గెలవాలన్న కసితో ఉన్నట్టు తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని.. ఇప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వారినీ కలిసి మాట్లాడుతున్నారు దివాకర్‌రెడ్డి. తమకు అండగా ఉన్నా వారి ఇళ్లకు వెళ్తున్నారు. వారి ఇంటో ఏ కార్యక్రమం జరిగినా.. హాజరవుతున్నారు జేసీ. పార్టీలతో సంబంధం లేకుండా అందరి ఇళ్లకు వెళ్లి పలుకరిస్తున్నారు.


  ఇదీ చదవండి : భక్తులకు శుభవార్త.. రేపు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలి


  2019 తరువాత నుంచి జిల్లాపై రాజకీయంగా పెద్దగా ఫోకస్ చేయని జేసీ దివాకర్ రెడ్డి.. ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని గ్రామాల పర్యటనలో చెబుతున్నారట. ముందుగా తమ సొంత మండలమైన పెద్దపప్పూరు నుంచి పెద్దాయన పర్యటన మొదలుపెట్టారు. జేసీ పర్యటనలు చూస్తున్న అనుచరులు, టీడీపీ నేతలు పెద్దాయన మళ్లీ రంగంలోకి దిగారని సంబరాలు చేసుకుంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, AP News, JC Diwakar Reddy, TDP

  ఉత్తమ కథలు