మంగళగిరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైసిపి నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీకి చెప్పకుండానే వైసీపీని దెబ్బ కొడుతా అని పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను ఆంధ్రుడిని. ఇక్కడే పుట్టాను. ఇక్కడే తేల్చుకుంటాను. నా యుద్ధం నేనే చేస్తానని పవన్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. వైసీపీని ఢీకొట్టడానికి ప్రధానితో చెప్పి చేయాలా తానే సరిపోతానని అన్నారు. ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే తానే వస్తానని, కానీ ఢిల్లీకి వెళ్లి సాయం అడగనని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీతో సమావేశం అయ్యాను. ఆ భేటీల్లో ఏం చర్చించానో సజ్జలకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. ప్రధానితో ఏం మాట్లాడానో కావాలంటే నా దగ్గరకు రా నీ చెవిలో చెబుతా అని పవన్ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత మేము కూడా లీగల్ గానే వైసిపి నేతల ఇళ్లను కూల్చేస్తాం. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం అని పవన్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.
నా మీద పడి ఏడుస్తున్నారు..
వైసిపి నాయకులు నా మీద పడి ఏడుస్తున్నారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇప్పటం గ్రామానికి వస్తుంటే అడ్డుకున్నారు. కేసులు పెట్టారు. కారులో వెళ్ళొద్దన్నారు. నడవొద్దన్నారు. నాకు తిక్క వచ్చే కారెక్కా అని అన్నారు. బెదిరింపులకు గురి చేసిన, హత్యా రాజకీయాలు చేసిన 2024 ఎన్నికల తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తామని పవన్ (Pawan Kalyan) సవాల్ విసిరారు. వైసిపి నేతలు పద్దతిగా వ్యవహరిస్తే తాము కూడా పద్దతిగా ఉంటామన్నారు. వైసిపి నాయకులు నీచంగా వ్యవహరిస్తే మాత్రం తాము విప్లవకారులుగా మారుతామన్నారు. ప్రతీ విషయానికి జగన్ ఎందుకు నవ్వుతారో తనకు అర్ధం కాలేదని పవన్ (Pawan Kalyan) చెప్పుకొచ్చారు.
నా అభిమానులు కూడా వైసీపీకి ఓటేశారు..
గత ఎన్నికల్లో నా అభిమానులు కూడా వైసీపీకి ఓటేశారు. అందుకే వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలిపిస్తే మిగిలిన ఇళ్లను కూల్చేస్తారన్నారు. వైసిపి నేతలు తమ భవిష్యత్తు కోసం 30 ఏళ్లు పాలనలో ఉండాలని చూస్తున్నారు. కానీ నేను 30 ఏళ్ల పాటు ప్రజలు ఎదగాలని నేను కోరుకుంటున్నా అని పవన్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మాకు చేతకావా. చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దలు కొడతాం. వైసిపి తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని పవన్ (Pawan Kalyan) చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Janasena, Modi, Pawan kalyan, PM Narendra Modi, Ycp