ఏపీలో రాజకీయంగా వామపక్షాలు బాగా వెనుకబడ్డాయి. ఒకప్పుడు ఏపీలో ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకున్న వామపక్షాలు.. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడే పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగే వామపక్షాలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు సాగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ,(TDP) జనసేన(Janasena) కూటమిగా ఎన్నికలకు వెళతాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు పార్టీల కూటమితోనే సీపీఐ కూడా కలిసి వెళుతుందని ఆ పార్టీ ముఖ్యనేత నారాయణ(Narayana) అన్నారు. తమకు కూడా సీట్లు కేటాయించాలని కోరారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన సొంత ప్రాంతమైన నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నారాయణ భావిస్తున్నారని.. అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారేమో అనే టాక్ వినిపిస్తోంది.
నగరి నుంచి పోటీ చేసేందుకు నారాయణ తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీలతో వామపక్షాలు పొత్తు పెట్టుకుంటే..అందులో భాగంగా నగరి నుంచి తాను పోటీ చేయాలనే ఆలోచనలో నారాయణ ఉన్నట్టు సమాచారం. అయితే నారాయణ కోరిక తీరడం అంత ఈజీ కాదనే చర్చ కూడా సాగుతోంది.
ఒకవేళ టీడీపీ , జనసేనతో కలిసి వామపక్షాలు బరిలోకి దిగినా.. టీడీపీ కూటమి ఈ సీటును సీపీఐ నుంచి బరిలోకి దిగే నారాయణకు ఇస్తుందని అనుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తరపున నగరి నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్ బరిలో నిలవబోతున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయనే టీడీపీ తరపున పోటీ చేశారు. అప్పట్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఆయన ధీమాగా ఉన్నారు.
AP Group-1 Mains: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా..కొత్త డేట్స్ ఇవే..
Pulivendula Firing Incident: పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి.. నిందితుడు ఎవరంటే..
ఇటీవల పాదయాత్రలో భాగంగా నగరిలో పర్యటించిన నారా లోకేశ్ సైతం.. ఇక్కడి నుంచి టీడీపీ తరపున గాలి భానుప్రకాశ్ బరిలో ఉంటారని ప్రకటించారు. దీన్ని బట్టి ఈ సీటులో పోటీ చేయబోయే అభ్యర్థిని టీడీపీ అప్పుడే ప్రకటించింది. నిజంగానే టీడీపీ, జనసేనతో సీపీఐ కూటమిగా జతకట్టినా.. నారాయణకు నగరి సీటును చంద్రబాబు కేటాయిస్తారని ఊహించలేమని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన కూటమితో కలిసి నగరి నుంచి పోటీ చేయాలనుకుంటున్న నారాయణ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh