ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ పలువురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. శాఖపై పట్టు సాధించలేకపోతున్న మంత్రులు, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్న ముగ్గురు మంత్రులను తొలగిస్తానని సీఎం జగన్ క్లారిటీ ఇవ్వడంతో.. ఆ ముగ్గురు మంత్రులు ఎవరనే దానిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రులు యాక్టివ్ అయ్యేందుకే సీఎం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరంటుంటే.. విపక్షాల విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చే విషయంలో చాలామంది మంత్రులు అంతగా సక్సెస్ కాలేకపోతున్నారనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్(YS Jagan) ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మంత్రివర్గం నుంచి తప్పించిన కొడాలి నాని(Kodali Nani), పేర్ని నానిలను(Perni Nani) మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసమే సీఎం జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారేమో అనే ప్రచారం సాగుతోంది.
గతంలో ఏపీ కేబినెట్లో ఉన్న కొడాలి నాని , పేర్ని నానిలు విపక్ష నేతలు చేసే వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలకు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తే.. పవన్ కళ్యాణ్ , జనసేన నేతలు చేసే విమర్శలకు పేర్ని నాని గట్టిగా బదులిచ్చేవారు. అయితే మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత ఈ ఇద్దరు చాలావరకు సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి విపక్షాల విమర్శలకు చెక్ చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్లు మాత్రం వీరి స్థాయిలో విపక్షాలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే వాదన ఉంది. ఇది కూడా ఈ ఇద్దరికీ కలిసొచ్చే అంశంగా మారిందనే చర్చ సాగుతోంది.
అందుకే ఒకవేళ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడితే.. మళ్లీ ఈ ఇద్దరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజంగానే సీఎం జగన్ మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ చేపట్టినా.. ఆయన ముందుకు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని.. అలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈ ఇద్దరినీ కేబినెట్లోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుందా ? అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.
Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ ఎఫెక్ట్.. కేంద్ర మాజీమంత్రి డైలమాలో పడిపోయారా ?
CM Jagan: సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రతి స్కూళ్లో ఏర్పాటు..
అయితే కొందరు మంత్రుల పనితీరు విషయంలో అంతగా సంతృప్తి చెందని సీఎం జగన్.. వారిని తప్పించాలనే గట్టి నిర్ణయానికి వచ్చారని.. వారి స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడే చెప్పడం కష్టమన్నది పలువురు వాదన. మొత్తానికి ఏపీ సీఎం జగన్ విపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే కొడాలి నాని, పేర్ని నానిలను మంత్రివర్గంలోకి తీసుకుంటారా ? అన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.