హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balakrishna: బాలకృష్ణ డిమాండ్‌కు జగన్ ఓకే చెబుతారా ?.. అలా జరిగే అవకాశం ఉందా ?

Balakrishna: బాలకృష్ణ డిమాండ్‌కు జగన్ ఓకే చెబుతారా ?.. అలా జరిగే అవకాశం ఉందా ?

Balakrishna: హిందూపురం జిల్లా విషయంలో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Balakrishna: హిందూపురం జిల్లా విషయంలో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Balakrishna: హిందూపురం జిల్లా విషయంలో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

  ఏపీ రాజకీయాల్లో కొత్త జిల్లాల వ్యవహారంపై అనేక కొత్త డిమాండ్లు అసంతృప్తులు వినిపిస్తున్నాయి. మిగతా డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా.. అనంతపురంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురంను ఏర్పాటు చేయాలన్నది హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్. ఇందుకోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం అఖిలపక్షాల నేతలతో చర్చించి తదపరి ఉద్యమ కార్యచరణపై క్లారిటీ ఇవ్వనున్నారు. తన నివాసంలో పార్టీ కార్యకర్తలతోనూ బాలకృష్ణ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.

  అయితే హిందూపురం జిల్లా విషయంలో బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయే స్థాయిలో ఓడిపోయింది. అంతటి వైసీపీ హవాలోనూ బాలకృష్ణ విజయం సాధించారు. హిందూపురంపై పట్టు పెంచుకునేందుకు బాలకృష్ణ ఈ రకమైన కార్యక్రమానికి పిలుపునిచ్చారనే చర్చ కూడా సాగుతోంది. అయితే బాలకృష్ణ డిమాండ్‌కు ఏపీ సీఎం జగన్ ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయా ? అన్నది సందేహమే. స్థానిక వైసీపీ నేతలు సైతం ఇదే రకమైన డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ.. జనంలో మాత్రం దీనిపై బాలకృష్ణ చేస్తున్న పోరాటమే ఎక్కువగా కనిపిస్తోంది.

  మరోవైపు బాలకృష్ణ డిమాండ్‌ను వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు పెద్దగా లేవనే చర్చ సాగుతోంది. ఒకవేళ బాలకృష్ణ డిమాండ్ చేయడం వల్లో లేక సొంత పార్టీ నేతలు ఒత్తిడి చేయడం వల్లో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తికి బదులుగా హిందూపురంను ఏర్పాటు చేస్తే.. మిగతా జిల్లాల విషయంలో ఇదే రకమైన కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.


  BalaKrishna: ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన బాలయ్య.. రేపు హిందూపురంలో మౌనదీక్ష

  YCP MLA: కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీ నేతల్లోనే అసంతృప్తి.. మరి సీఎం ఏం చేస్తారో..?

  అంతేకాదు ఉద్యమిస్తే ప్రభుత్వం ఈ విషయంలో దిగొస్తుందనే సంకేతాలు ఇస్తే.. మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే రకమైన డిమాండ్లు రావొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ డిమాండ్‌ను వైసీపీ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఈ క్రెడిట్ కచ్చితంగా బాలకృష్ణకే దక్కుతుందనే భావనలో వైసీపీ ఉంది. దీంతో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలనే బాలకృష్ణ డిమాండ్‌ విషయంలో సీఎం జగన్ అంత సానుకూలంగా ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు