ఏపీ శాసన సభా సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా... శాసన మండలి సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో భాగంగా రేపు తొలి రోజే మూడు రాజధానులకు (Three Capitals) సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనిపై చర్చతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ (Ysrcp) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. ఇందుకు పలు న్యాయపరమైన సమస్యలు కూడా ఉన్నాయి.
అయితే ఏది ఏమైనా.. మూడు రాజధానుల ఏర్పాటు.. అందులోనూ విశాఖను పరిపాలన రాజధానిగా చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైసీపీ ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. టీడీపీ సహా విపక్షాలన్నీ ఏకమైనా.. ఈ విషయంలో తమ ప్రయత్నాలను అడ్డుకోలేరని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మరోసారి మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారా ? అనే అంశం ఆసక్తిరేపుతోంది. మరోవైపు విశాఖను పరిపాలన రాజధానిగా మార్చుతామని గతంలోనే ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్ అక్కడి నుంచి పరిపాలన చేపట్టేందుకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేస్తోందని వార్తలు వచ్చాయి.
త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఇది ఆచరణలోకి మాత్రం రాలేదు. తాజాగా మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో మరోసారి ప్రకటన చేస్తే.. ఈ అంశంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మిగతా వారికంటే ముందు తానే ఒక అడుగు ముందు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారని.. అందుకే విశాఖ నుంచి పరిపాలన సాగించే దిశగా ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
VIjayawada: తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు..! తీరా అందులో ఉన్నది చూసి షాక్..!
Breaking News: మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?
అందుకే మరోసారి ఈ అంశంపై సీఎం జగన్ ప్రకటన చేస్తే.. కచ్చితంగా తాను కూడా ఎప్పుడు విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాననే విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం మరోసారి ముందుకు సాగేలా నిర్ణయం తీసుకుంటే.. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.