AP POLITICS WILL CM JAGAN SAY ANY GOOD NEWS TO AP PEOPLE WHAT IS THE MAIN AGENDA TO MEET PRIME MINSTER MODI NGS
CM Jagan Delhi Tour: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా? నేడు ప్రధానితో సమావేశంలో క్లారిటీ
రేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)
CM Jagan Delhi Tour: ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పనున్నారు. ప్రధానితో సమావేశంలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ నెల రెండోసారి ఆయన ప్రధానితో భేటీ అవుతున్నారు. దీంతో సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ వీరి భేటీ అజెండా ఏంటంటే..?
CM Jagan Delhi Tour: సీఎం జగన్ఢిల్లీటూర్ ఆసక్తి పెంచుతోంది. సాధారణంగా ప్రధాని అపాయింట్ మెంట్ ఒక్కసారి దొరకడమే కష్టం.. అలాంటింది ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) రెండో సారి ప్రధాని కలవనున్నారు. అందుకే ఈ సమావేశపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ ఢిల్లీ పర్యటనకు (Delhi Tour) వెళ్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. అంతకుముందే ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. మూడు వారాల క్రితం సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నెల రోజుల సమయంలోనే ప్రధాని మోదీతో మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటనలో ఏదో ప్రత్యేకత ఉంది అంటున్నారు. అది రాజకీయంగానా లేదా.. ఆర్థికపరమైన అంశాలపైనా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు,పోలవరం, కేంద్రం నుంచి సహకారంపై చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు.. రాష్ట్రపతి ఎన్నికపైనా చర్చ జరగనుంది. అయితే అన్నికన్నా ముఖ్యంగా తాజాగా పెట్రో ఉత్పత్తుల పైన వ్యాట్ తగ్గింపు అంశం పైనా నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. బీజేపీయేతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ఇటీవల ప్రధాని కోరారు. ఇందులో భాగంగా స్వయంగా జగన్ మోహన్ రెడ్డి.. దీనిపై ప్రధానితో చర్చి వ్యాట్ తగ్గించే ఆలోచనలో కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు పెద్ద గూడ్ న్యూస్ చెప్పినట్టే.. అలాగే ఈ నెల 30వ తేదీన జరిగే జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు.
దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల పైన ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సీఎం జగన్ సమావేశమయ్యారు. జాతీయ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాల పైన చర్చించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనకంటే ముందు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్, సీఎంల మధ్య దాదాపు గంటకు పైగా చర్చజరిగింది. రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల వ్యవస్ధతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం గవర్నర్కు వివరించారు. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను గవర్నర్ హరిచందన్ కలిశారు. మోదీ, అమిత్ షాతో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సీఎం జగన్తో గవర్నర్ హరిచందన్ చర్చించారు. వైసీపీ పరిపాలన, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి గవర్నర్ నివేదిక ఇచ్చారని ప్రచారం జరిగింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.