హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?

AP Politics: సీఎం జగన్ కేబినెట్ లోకి మళ్లీ మాజీలు.. ఆ ఇద్దరికీ బెర్త్ లు ఫిక్స్..? ముహూర్తం ఎప్పుడు?

 సీఎం జగన్ కేబినెట్ లోకి ఆ ఇద్దరు..

సీఎం జగన్ కేబినెట్ లోకి ఆ ఇద్దరు..

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సీఎం జగన్ కేబినెట్ కూర్పు చర్చనీయాంశంగా మారింది. ఈ నవంబర్ లో కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ మొదలైంది. మాజీ మంత్రులు.. మళ్లీ మంత్రులు కానున్నారు.. సోషల్ మీడియాలో నాని లు ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. వైసీపీలో వారిద్దరిపైన చర్చ జోరుగా సాగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  మంత్రివర్గంలో మళ్లీ  తప్పవా..? ఈ నవంబర్ లోనే అందుకు ముహూర్తం సిద్ధమైందా..? సాధారణంగా అయితే.. రెండేళ్లకు పైగా ఇదే కేబినెట్ (AP  Cabinet) కొనసాగుతుందని.. ఇదే తన ఎన్నికల టీం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చెప్పినట్టు ప్రచారం జరిగింది. దీంతో మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేవు అనుకున్నారు. ఇటీవల జగన్.. మంత్రులపై చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు అనే ప్రచారం నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారని.. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నా.. కౌంటర్లు ఇవ్వడం లేదని సీఎం జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడం కూడా చేయని వారిని.. మంత్రి పదవుల నుంచి తప్పించడానికి కూడా వెనుకాడనని జగన్ మండిపడ్డారు. అది కూడా ప్రైవేటుగా వారికి చెప్పడం కాదు.. కేబినెట్ భేటీలో అందరి మధ్యనే ఇలా తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

  అప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే కనిపించే మంత్రులు.. సీఎం జగన్ క్లాస్ పీకడంతో.. మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు , లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు బూతులు కూడా తిట్టేశారు. ఆ తరువాత కూడా చాలామంది.. ఇంకా ప్రతిపక్షాలను తిట్టడంలో వెనుకబడే ఉన్నారు..? అసలు కొందరు మంత్రులు పెద్దగా మీడియా ముందు కూడా కనిపించడం లేదు. అలాగే కొందరు మంత్రులు అనే సంగతి ప్రజలకే తెలియని పరిస్థితి ఉందనే విమర్శలు ఉన్నాయి.

  ఈ నేపథ్యంలోనే అలాంటి వారిని మార్చి జగన్.. కట్టిగా మాట్లాడేవారిని తిరిగి తన టీంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మాట్లాడని మంత్రులను కేబినెట్ లో కొనసాగిస్తే.. ఎన్నికల సమయానికి నష్టమే తప్ప.. లాభం ఏమీ ఉండదు అని జగన్ భావిస్తున్నట్టు టాక్. అలాంటి వారిని పక్కన పెట్టి.. కొందరు మాజీలను మళ్లీ కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఫిక్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.

  ఇదీ చదవండి : లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తున్నారా..? ఇలా చేయండి.. వారి వేధింపుల తప్పించుకోండి

  అయితే మంత్రి పదవులు పోయిన తరువాత సైలెంట్ గా కనిపించిన ఆ ఇద్దురు.. తాజాగా మరోసారి తమదైన స్టైల్లో ప్రతిపక్షంపై మండి పడుతున్నారు. దీంతో వారిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది…మరి ఈ సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? లేదా? అనేది చూడాలి.

  ఇదీ చదవండి : దేశంలోనే రెండో అతి పెద్ద మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎలా చేశారో చూడండి

  ఇటు సోషల్ మీడియానూ.. అటు తెలుగు దేశం పార్టీ నేతల్లోనూ వీరిద్దరి పైనే చర్చ జరుగుతోంది. కొడాలి నాని , పేర్నినాని, అనిల్ ముగ్గురు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రతిపక్షాలపై మంత్రుల విమర్శల డోసు పెంచాలి అంటే.. ఈ ముగ్గురు కేబినెట్ లో ఉండాలని వైసీపీ సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది. తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలతో.. కచ్చితంగా ఆ ముగ్గుర్ని మళ్లీ కేబినెట్ తీసుకోవాలనే సరిపోవడం లేదని సీఎం జగన్ మందలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మంత్రి వర్గంలో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకుల పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కొడాలి నాని, పేర్ని నాని , అనిల్ పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. వైసీపీ కార్యకర్తలు సైతం.. వారిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kodali Nani

  ఉత్తమ కథలు