హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chiranjeevi-Ysrcp: చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆ ఇద్దరు వైసీపీ నేతలను గురించేనా..?

Chiranjeevi-Ysrcp: చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆ ఇద్దరు వైసీపీ నేతలను గురించేనా..?

చిరంజీవి (ఫైల్ ఫోటో)

చిరంజీవి (ఫైల్ ఫోటో)

AP Politics: ఏపీలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేది వైసీపీ నేతలే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. దీంతో చిరంజీవి టార్గెట్ చేసింది కూడా వైసీపీ నేతలనే అనే చర్చ జరుగుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధం ఉన్న కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు మితిమీరి పవన్‌ను అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుందన్న చిరంజీవి(Chiranjeevi).. పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ తన దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారని అన్నారు. తన తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందనే బాధ తనకు ఉందని సంచలన వ్యాఖలు చేశారు. పవన్ కళ్యాణ్(pawan kalyan) స్వార్థం లేదని.. డబ్బు యావ లేదని.. పదవీ కాంక్ష లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే వారిని ఎందుకు టార్గెట్ చేశారు ? అసలు ఆయన ఎవరిని టార్గెట్ చేశారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏపీలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేది వైసీపీ (ysrcp)నేతలే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. దీంతో చిరంజీవి టార్గెట్ చేసింది కూడా వైసీపీ నేతలనే అనే చర్చ జరుగుతోంది. అందులోనూ వైసీపీలోని ఒకరిద్దరు నేతలే పవన్ కళ్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. వారిలో మాజీమంత్రి పేర్ని నాని ముందుండగా... మంత్రి పదవి చేపట్టిన తరువాత అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్‌ను ఎక్కువగానే టార్గెట్ చేస్తున్నారు.

చిరంజీవికి సన్నిహితులైన మంత్రి బొత్స సత్యనారాయణ , మాజీమంత్రి కన్నబాబు పవన్ కళ్యాణ్‌ను అంత గట్టిగా టార్గెట్ చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. దీంతో చిరంజీవి పేర్ని నాని, అంబటి రాంబాబును ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు పేర్ని నాని, అంబటి రాంబాబు చిరంజీవి సామాజికవర్గానికి చెందిన నాయకులే కావడం గమనార్హం.

Pawan Kalyan: చంద్రన్న కానుకలో తొక్కిసలాటపై పవన్ సంచలన ప్రకటన.. చర్యలు చేపట్టాలని డిమాండ్

AP Politics: టార్గెట్ కేసీఆర్ .. జగన్‌కు మాత్రమే అవకాశం.. చంద్రబాబుకు మిస్ చేసుకున్నారా ?

వైసీపీలో ఉన్న పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్లు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడంలో ముందున్న.. చిరంజీవి కచ్చితంగా వీరిని లక్ష్యంగా చేసుకునే పరోక్షంగా కామెంట్స్ చేశారని అనుకోలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో తనదైన దూసుకుపోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలిసొచ్చేవే అనే వాదన కూడా వినిపిస్తోంది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి రాజకీయ మద్దతు కచ్చితంగా ఉంటుందనే వాదనకు ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తాయనే టాక్ కూడా ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Chiranjeevi, Ysrcp