Home /News /andhra-pradesh /

AP POLITICS WILL CHANDRABABU NAIDU DECISION WORKOUTS TDP LEADER ALRET BEFORE ELECTIONS NGS

Chandrababu: చంద్రబాబు అనూహ్య నిర్ణయం ఫలితాలను ఇస్తోందా.. డోన్ ప్రకటన తరువాత నేతల్లో మార్పు

చంద్రబాబు నిర్ణయం ఫలితాలు ఇస్తోందా?

చంద్రబాబు నిర్ణయం ఫలితాలు ఇస్తోందా?

Chandrababu: తెలుగు దేశం పార్టీ నేతల్లో మార్పు మొదలైందా.. ఇటీవల డోన్ లో చంద్రబాబు చేసిన ప్రకటనే అందుకు కారణమా..? డోన్ లో అనూహ్యంగా ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీలో సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ప్రకటన చేసిన చాలా రోజులే అయినా.. ఇప్పటికీ టీడీపీలో దీనిపై చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  Chandrababu: సాధారణంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చాలా హెచ్చరికలు చేస్తారు.. కానీ అవేవి అమలు చేయరని పార్టీ నేతల్లో టాక్ ఉండేది. తాము ఏం చేసినా చూసి చూడనట్టు వెళ్లిపోతారని.. సీనియర్లు లైట్ తీసుకునే వారు.. గత రికార్డులతో కాలం నెట్టుకొచ్చేవారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాట ఏంటంటే..? పని చేసే వారికి పార్టీలో పదవులు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఇది చంద్రబాబు రొటీన్ డైలాగ్ అంటూ కొందరు లైట్ తీసుకున్నారు. కానీ ఈ మధ్య చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్‌కు భిన్నంగా సాగింది. కర్నూలు (kurnool) సమావేశంలో పార్టీ కేడర్‌ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్‌ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. పార్టీలో ఉన్న కీలక నేతలు, సీనియర్లను కాదని డోన్‌ అభ్యర్థిగా సుబ్బారెడ్డి (Subbareddy) పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది.

  అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అద్భుత ఫలితాలు ఇస్తోంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. డోన్‌లో టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక కేఈ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కరపత్రాలు వేయడం.. నిరసనలు తెలియజేయడం కలకలం రేపింది. కేఈ కుటుంబానికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్స్‌ వినిపించాయి. ఆ ఎపిసోడ్‌లో పార్టీ అధిష్ఠానం కేఈ వర్గానికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఆ గందరగోళానికి తెరదించడానికే డోన్‌ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని టాక్. వచ్చే ఎన్నికల్లో డోన్‌లో కేఈ కుటుంబం పోటీ చేస్తుందని కొందరు.. కోట్ల కుటుంబం నుంచి బరిలో ఉంటారని మరికొందరు రకరకాలుగా ప్రచారంచేశారు. చర్చలు పెట్టారు. అలాంటి వాటన్నింటికీ సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చెక్‌ పెట్టారు చంద్రబాబు.

  ఇదీ చదవండి : మొన్న 46 మంది.. తాజాగా మరో 25 మంది అరెస్ట్.. అమలాపురం అల్లర్ల కేసులో పోలీసుల దూకుడు.. వాట్సప్ గ్రూపులపై నిఘా? మరో 25 మందిపై కేసు

  డోన్‌ అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వడం ద్వారా పార్టీ నేతలు చంద్రబాబు మరో మెసేజ్‌ పంపారని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఒత్తిళ్లకు తలొగ్గబోమని, పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టత ఇచ్చినట్టు అయ్యింది. సుబ్బారెడ్డి జైలుకు వెళ్లి వచ్చారని.. పార్టీ కోసం గట్టిగా పోరాడుతున్నారని చంద్రబాబు వేదికపైనే చెప్పారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ పార్టీ కోసం వెనక్కి తగ్గడం లేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన భయపడలేదని తెలిపారు. ఈ రెండు ఉదాహరణల ద్వారా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటారనే సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. పైగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఊరు బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో 6 వార్డులను టీడీపీ దక్కించుకోవడం వెనక సుబ్బారెడ్డి పాత్రను గుర్తించారు. అందుకే డోన్‌ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారని విశ్లేషిస్తున్నారట.

  ఇదీ చదవండి : వ్యవసాయ భూమి ఉందా? ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. 30 ఏళ్లు లాభాలు.. ఏడాదికి లాభం ఎంతో తెలుసా?

  డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు కానీ.. ఇకపై నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. డోన్‌లో బాగా పట్టున్న కేఈ వర్గం సుబ్బారెడ్డికి సహకరిస్తుందా.. లేక అసంతృప్తిని కొనసాగిస్తుందా అనేది చూడాలి. మరోవైపు కోట్ల కుటుంబానికి కూడా నియోజకవర్గంలో పట్టుంది. ఈ రెండు కుటుంబాల తీరు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో ఊహించాలి. అయితే చంద్రబాబు నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం సీనియర్ నేతల్లో భయం పెంచింది అని ప్రచారం ఉంది. అందుకే గతంలో పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కనిపించని నేతలంతా.. ఇప్పుడు మేం ఉన్నామంటూ అధిష్టానం చూపు తమపై పడేలా చేసుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో సీటు రావాలి అంటే ఇక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే జనం బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు