హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: ఏపీలో కాపు-కమ్మ కాంబినేషన్ సెట్ అవుతుందా..? పవన్ ప్రతిపాదనకు బాబు ఓకే చెప్తారా..?

AP Politics: ఏపీలో కాపు-కమ్మ కాంబినేషన్ సెట్ అవుతుందా..? పవన్ ప్రతిపాదనకు బాబు ఓకే చెప్తారా..?

చంద్రబాబు, జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కుల రాజకీయాలపాత్ర గణనీయంగా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలు కూడా కులాల వారీగా ఓటుబ్యాంక్ రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో ఏ.పి రాజకీయాలలో కుల ప్రాభల్యం మరింత ఎక్కువైందని చెప్పడంలో సందేహం అక్కరలేదు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, News18, Amaravati

  దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కుల రాజకీయాలపాత్ర గణనీయంగా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీలు కూడా కులాల వారీగా ఓటుబ్యాంక్ రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో ఏ.పి రాజకీయాలలో కుల ప్రాభల్యం మరింత ఎక్కువైందని చెప్పడంలో సందేహం అక్కరలేదు. ఏపీ రాజకీయాలను టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆతర్వాత గా విభజించవచ్చు. అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయిగా ఉండేది. 1983 లో తెలుగుదేశం (Telugu Desham party) ఆవిర్భావంతో కమ్మ సామాజికవర్గం రాజకీయంగా తమ సత్తా చాటడమే కాక రెడ్డి సామాజిక వర్గానికి ధీటుగా ఎదిగారు. అప్పటి వరకు ఐతే కాంగ్రెస్ పార్టీ (Congress Party) కాకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న కాపు సామాజిక వర్గం 2008లో ప్రజారాజ్యం (Prajarajyam) ఆవిర్భావంతో తమకూ రాజ్యాధికారం కావాలంటూ ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. జనసేన (Janasena Party) ఏర్పాటుతో కాపు సామాజికవర్గంలో వారి ఆశలు మరింత బలపడ్డాయనే చెప్పాలి.

  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో త్రిముఖపోరు నడుస్తుందనే చెప్పాలి. ఐతే అధికార వైసీపీ ఏ పార్టీతో కూడా పొత్తులు లేకుండా ఒంటరి పోరుకు సిధ్ధం అవుతుండగా.., తెదేపా,జనసేనలు మాత్రం పొత్తులు కోసం తలుపులు తెరిచారు. గతంలో జనసేన-బీజేపీ-టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకున్నారు. ఐతే టీడీపీ అధికారంలోకి రావడానికి సహకరించిన తమని నిర్లక్ష్యం చేశారని కాపులు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీంతో 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి అధికారం వైసీపీ చేతికి అప్పజెప్పారనే ప్రచారమూ లేకపోలేదు.

  ఇది చదవండి: కోనసీమ అల్లర్ల కేసులో షాకింగ్ ట్విస్ట్.. నిందితుల్లో నలుగురు మంత్రి అనుచరులు


  ఈ సారి మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఒటు చీలడానికి వీలు లేదని జనసేన - టీడీపీ గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఐతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి గతంలో టీడీపీ అధికారంలోకి రావటానికి తాము సహకరించాము కనుక ఈ సారి తాము అధికారంలోకి రావడానికి ఆ పార్టీ సహకరించాలంటూ బహిరంగంగానే పెద్ద బాంబు పేల్చారు.

  ఇది చదవండి: పవన్ కు అండగా కుటుంబం.. కీలక సమయంలో భారీ సాయం.. దేనికోసమంటే..?


  ఎటొచ్చీ రాబోయే ఎన్నికలు టీడీపీకి ప్రాణసంకటంగా మారాయనే చెప్పాలి. పైగా ఈసారి టీడీపీని ఓడిస్తే.. ఆ తర్వాత ఎన్నికల నాటికి చంద్రబాబు యాక్టివ్ గా ఉండరని.. ఇటీవల నిర్వహించిన పార్టీ వర్క్ షాప్ లో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఒక రకంగా అదీ నిజమే కాబట్టి పవన్ కళ్యాణ్ షరతులకు చంద్రబాబునాయుడు తలొగ్గక తప్పని పరిస్థితి.

  ఇది చదవండి: పీవీ, వైఎస్ పైనే పోటీ.. ఎన్నిక ఏదైనా ఆయన ఉండాల్సిందే.. ఎలక్షన్ల కొండయ్య స్టోరీ ఇది..


  ఐతే కేవలం 6% ఓట్లు కలిగిన జనసేనకు దాదాపు 40% ఓటు బ్యాంక్ కలిగిన టీడీపీ అధికారం అప్పగించడం ఏంటని కమ్మ సామాజికవర్గం పెద్దలు లోలోన రగిలిపోతున్నారట. ఇదే సమయంలో జనసేనకు చెందిన పలువురు నేతలు మాత్రం.. కాపు జనాభా అంశాన్ని లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న తమకే అధికారం కావాలంటున్నారు. తమ మద్దతు లేనిదే అధికారం లోకి రాలేదని, అధికారం కావాలంటే ఈ సారి చంద్రబాబు తమకు మద్దతు ఇవ్వక తప్పదని కాపు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. జనసేన డిమాండ్ కు తలొగ్గుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన నిర్ణయాన్ని బట్టే జనసేన మద్దతు ఆధారపడుతుంది. మరి ఈసారి కాపు, కమ్మ బేజషాలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తారా..? లేదా విడివిడిగా పోటీ చేసి వైసీపీకి అధికారం అప్పజెప్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, TDP

  ఉత్తమ కథలు