Home /News /andhra-pradesh /

AP POLITICS WILL BYREDDY SIDHARTH REDDY JOIN TDP WHY HE WILL NOT ATTENDING KEY SAP MEETING NGS TPT

Byreddy Siddharth Reddy: లోకేష్ తో వైసీపీ నేత భేటీ నిజమేనా? రాష్ట్ర స్దాయి సమీక్షకు బైరెడ్డి డుమ్మా?

కీలక సమావేశానికి బైరెడ్డి దూరం

కీలక సమావేశానికి బైరెడ్డి దూరం

Byreddy Sidharth ReddY: వైసీపీ యువ నేత పార్టీ మారాలి అని డిసైడ్ అయ్యారా? లోకేష్ తో భేటీ అయ్యింది నిజమేనా? ఆ వార్తలను ఖండించిన తరువాత రోజే.. ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. కీలక మీటింగ్ కు ఎందుకు డుమ్మా కొట్టారు..?

    Big Shock to YCP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరో పరిణామం హాట్ టాపిక్ అవుతోంది.  అధికార పార్టీ నుంచి .. టీడీపీలోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఈ పరిణామా ఆసక్తికరంగా మారింది.  ఇప్పటికే అధికార పార్టీలో కేబినెట్ విస్తరణ వ్యవహారంతో అసమ్మతి రాగం పెరిగింది. ఇదే సమమంలో వర్గ పోరుతో కొన్ని జిల్లాల్లో కీలక నేతలు సైతం అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. రోజుకో నేత మనసులో ఆవేదనను బయట పెడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ యువ నేత.. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నేత వ్యవహారం సంచలనంగా మారింది.  సోష‌ల్ మీడియా స్టార్‌,  వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్‌, ఏపీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి (Byreddy Sidharth Reddy) తెలుగుదేశం పార్టీ  (Telugu  Desam Party) గూటికి చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఈ సమయంలో ఆయన చేసిన పని ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా చేస్తోంది.

    ఏపీ సీఎం జ‌గ‌న్ (CM Jagan) కు హార్డ్ కోర్ అనుచ‌రునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ఇంత సడెన్ గా పార్టీ మారడం ఏంటని అంతా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.  కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఈ ప్రచారం ప్రత్యర్థి పార్టీలది అయితే పట్టించుకోనని.. కానీ సొంత పార్టీ నేతలే తనను జగన్ కు దూరం చేయాలని చూస్తే.. ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఎవర్నీ వదిలి పెట్టేది లేదని.. కచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటాను అన్నారు. పార్టీ మారడం లేదని చెప్పిని ఆయన.. తాజాగా అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.

    ఇదీ చదవండి : మంత్రి మొబైల్ కే దిక్కులేదా..? రోజా ఫోన్ చోరీ చేసిందెవరు? మూడు టీంలతో గాలింపు

    ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ మంత్రి హోదా లో శాప్ పై తొలి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ సమీక్షకు ప్రిన్సిపల్ సెక్రటెరీ వాణిమోహన్, శాప్ ఎండి సహా ఇతర అధికారులు హాజరయ్యారు.. కానీ.. ఈ కీలక సమావేశానికి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి డుమ్మా కొట్టారు.. రాష్టస్థాయి సమావేశానికి.. అదికూడా చైర్మన్ హోదాలో ఆయన తప్పక హాజరవ్వాల్సిన కార్యక్రమం.. మంత్రి కూడా అందులో పాల్గొన్నారు. కానీ అలాంటి మీటింగ్ కు.. సిద్ధారెడ్డి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా పార్టీ మారుతారు అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన డుమ్మా కొట్టడంపై అనుమానాలు పెరుగుతున్నాయి.. ఆ వార్తలు నిజమేనా అని వైసీపీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయనే ప్రచారం ఉంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు