హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RK Roja: జగన్ సర్వే రిపోర్ట్.. రోజాకు మళ్లీ నగరిలో కష్టాలు మొదలుకానున్నాయా ?

RK Roja: జగన్ సర్వే రిపోర్ట్.. రోజాకు మళ్లీ నగరిలో కష్టాలు మొదలుకానున్నాయా ?

రోజా, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

రోజా, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

AP Politics: రాజకీయాల్లో ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు కూడా ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయే తత్వం ఉన్న రోజా.. జగన్ మరోసారి సర్వే చేసేనాటికి పనితీరు మెరుగుపరుచుకుంటారని పలువురు అభిప్రాయపడుతుంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి కనిపించకపోయినా.. ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ (Ysrcp) కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) .. పార్టీ కార్యక్రమాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే 27 మంది ఈ విషయంలో వెనుకబడ్డారని సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. వాళ్లు ఎవరనే దానిపై అనేకమంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మిగతా వారి సంగతి పక్కనపెడితే.. ఈ జాబితాలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా (RK Roja) పేరు కూడా ఉందనే వార్త ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  వైసీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకు.. రెండో విడతలో మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం జగన్ . అంతకుముందు వరకు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల ద్వారానే ఇబ్బందిపడ్డ రోజా.. మంత్రి పదవి చేపట్టిన తరువాత ఈ విషయంలో వాటిని అధిగమించినట్టు కనిపించారు. దీంతో రోజాకు ఇక నగరిలో మరోసారి తిరుగులేదని.. ఆమెకు మరోసారి వైసీపీ టికెట్ రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న ఆమె ప్రత్యర్థి వర్గం ప్లాన్ ఫలించడం కష్టమని అంతా అనుకున్నారు.

  అయితే సీఎం జగన్ పనితీరు సరిగ్గా లేదని ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో మంత్రి రోజా పేరు కూడా ఉందనే ప్రచారం బయటకు రావడంతో.. నగరిలో ఆమె మళ్లీ ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు మొదలయ్యయి. రోజా నగరిలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. అక్కడ ఆమె ప్రత్యర్థి వర్గం కూడా ఎంతో బలంగా ఉంది. వారికి ప్రభుత్వం తరపున నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి.

  వైసీపీ ప్రభుత్వంలోని కీలక మంత్రితో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే వాళ్లంతా కలిసి రోజాను ఇబ్బందిపడేలా చేశారన్న వాదన ఉంది. తాజాగా రోజా పనితీరు సరిగ్గా లేదని సీఎం జగన్‌కు అందిన సర్వేలో తేలిందనే విషయం బయటకు రావడంతో నగరిలో రోజా ప్రత్యర్థి వర్గం మరోసారి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని చిత్తూరు జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చ మొదలైంది.

  Vijayawada: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

  Vijayawada: నిన్నమంత్రికి.. అదే రోజు అర్చకులకు అవమానం.. ఇప్పుడు భవానీలతో వివాదం.. కొండపై ఏం జరుగుతోంది?

  అయితే రాజకీయాల్లో ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు కూడా ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయే తత్వం ఉన్న రోజా.. జగన్ మరోసారి సర్వే చేసేనాటికి పనితీరు మెరుగుపరుచుకుంటారని పలువురు అభిప్రాయపడుతుంటారు. మొత్తానికి మంత్రి అయిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న రోజా.. మరోసారి సొంత నియోజకవర్గం నగరిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చినట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Rk roja

  ఉత్తమ కథలు