హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kiran Kumar Reddy: చంద్రబాబు తరహాలోనే కిరణ్ కుమార్ రెడ్డి మనసు విప్పుతారా ?.. అందరిలోనూ ఆసక్తి

Kiran Kumar Reddy: చంద్రబాబు తరహాలోనే కిరణ్ కుమార్ రెడ్డి మనసు విప్పుతారా ?.. అందరిలోనూ ఆసక్తి

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (పాత ఫొటో)

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (పాత ఫొటో)

Kiran Kumar Reddy: ఈ షోలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఏమైనా మాట్లాడారా ? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు(Balakrishna Unstoppable Show) వచ్చారు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కూడా ఈ షోకు వచ్చిన సందడి చేశారు. బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి పాత స్నేహితులు కావడంతో.. ఒకప్పటి మెమొరీస్‌ను ఈ ముగ్గురు అన్‌స్టాపబుల్ వేదిక మీద పంచుకున్నట్టు ప్రోమోను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ షోలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy).. తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఏమైనా మాట్లాడారా ? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది. రాష్ట్రం విడిపోయిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్(Congress) పార్టీకి కూడా రాజీనామా చేశారు. అయితే ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. సెకండ్ ఇన్నింగ్ మొదలుపెడతారేమో అని అంతా అనుకున్నారు.

ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీకి వచ్చిన సమయంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి కనిపించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి మరోసారి దూరంగా ఉండాలని డిసైడయినట్టు చాలామంది భావించారు. అయితే తాజాగా ఆయన అన్‌స్టాపబుల్ షోకు రావడంతో... ఈ షోలో కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి మాట్లాడారా ? అనే చర్చ జరుగుతోంది.

ప్రోమోలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోయినా.. బాలకృష్ణ ఈ విషయంపై కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిప్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌పై రెండున్నర దశాబ్దాల తరువాత స్పందించారు. అసలు అప్పుడు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Chandrababu Naidu: చంద్రబాబు కర్నూల్ పర్యటనలో టెన్షన్..టెన్షన్..రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు..కట్టలు తెచ్చుకున్న బాబు ఆగ్రహం

Supreme Court: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఆ పిటిషన్ తిరస్కరణ

అప్పట్లో తాను చేసిన పనిలో తప్పులేదని ప్రజలకు ఈ షో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తరహాలోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఏమైనా మాట్లాడారా ? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఈ షో ద్వారా ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి ఎవరూ రాబట్టని కొత్త విషయాలను బాలకృష్ణ బయటకు తీసుకొచ్చినట్టు అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Nallari Kiran Kumar Reddy, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు