హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan- Janasena: సీఎం జగన్ సర్వే రిపోర్ట్.. పవన్ కళ్యాణ్‌కు అది కలిసొచ్చే అంశమా ?

YS Jagan- Janasena: సీఎం జగన్ సర్వే రిపోర్ట్.. పవన్ కళ్యాణ్‌కు అది కలిసొచ్చే అంశమా ?

జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

జగన్, పవన్ (ఫైల్ ఫోటో)

Bhimavaram: భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పటి నుంచి మళ్లీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జనసేన పార్టీ వర్గాలు నుంచి కానీ, పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎలాంటి సంకేతాలు రావడం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో వాళ్లు సరిగ్గా పాల్గొనకపోవడాన్ని సీఎం జగన్ తప్పుబట్టారు. రాబోయే రోజుల్లో వీరంతా తమ పొరపాటును సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ విషయాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. అయితే సీఎం జగన్ (YS Jagan) క్లాస్ తీసుకున్న ఎమ్మెల్యేల జాబితాలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో భీమవరం ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) గట్టి పోటీ ఇచ్చిన గ్రంథి శ్రీనివాస్.. ఆయనపై విజయం సాధించారు. భీమవరంలో(Bhimavaram) పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పటి నుంచి మళ్లీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై జనసేన పార్టీ వర్గాలు నుంచి కానీ, పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎలాంటి సంకేతాలు రావడం లేదు.

  అసలు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ క్లాస్ తీసుకుని, పనితీరు మారాలని సూచించిన ఎమ్మెల్యేల జాబితాలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఉండటంతో.. ఆయనపై జనంలో సానుకూలత లేదనే విషయం తేలిపోయిందని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీ సర్వేలోనే ఈ విషయం తేలిందంటే.. ఇది జనసేనకు, పవన్ కళ్యాణ్‌కు అనుకూలించే అంశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో 8 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు.

  పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోయినప్పటికీ.. భీమవరం నుంచి ఆయన ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ ఇక్కడ పవన్‌ను ఓడించేందుకు ఎక్కువగా ఫోకస్ చేసిందనే చర్చ కూడా జరిగింది. అయితే మరోసారి ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే విజయం తథ్యమనే చర్చ కూడా జరిగింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ సర్వే నివేదికను బట్టి ఇక్కడ వైసీపీకి పరిణామాలు అంత అనుకూలంగా లేవని విషయం తేలిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

  వైసీపీపై అలీ అసంతృప్తి..? ఆ పార్టీవైపు చూస్తున్నారా..? అక్కడి నుంచే పోటీ..?

  AP Politics: ఏపీలో మరోసారి పోస్టర్ల రచ్చ.. అలాంటి రాతలు అవసరమా..? రాజకీయ వర్గాల్లో చర్చ

  అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. సీఎం జగన్ కేవలం గడపగడపకు వైసీపీ కార్యక్రమం గురించి మాత్రమే చెప్పారని.. అయినా ఎన్నికలకు మరికొంత సమయం ఉన్న సమయంలో ఇలాంటి నివేదికలు గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టడానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నాయి. మొత్తానికి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే సైతం జగన్ క్లాస్ తీసుకున్న వారి లిస్టులో ఉండటం ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan

  ఉత్తమ కథలు