హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సీఎం జగన్ మళ్లీ ర్యాంకులు ఇస్తారా ? ఎమ్మెల్యేల్లో మళ్లీ టెన్షన్

YS Jagan: సీఎం జగన్ మళ్లీ ర్యాంకులు ఇస్తారా ? ఎమ్మెల్యేల్లో మళ్లీ టెన్షన్

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

AP Politics: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కొంతకాలం క్రితం నుంచే కసరత్తు మొదలుపెట్టిన వైఎస్ జగన్.. ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోతే తాను కూడా చేయగలిగింది ఏమీ లేదంటూ కుండబద్ధలు కొట్టారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గతంలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలపై ఫోకస్ చేయని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. కొంతకాలం క్రితం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆ పార్టీ నేతలకు చెమటలు పట్టించాయి. గడప గడపకు (Gadapa Gadapaku Ysrcp) వైసీపీ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్న ఎమ్మెల్యేలకు చురకలు అంటించేలా సీఎం జగన్ ర్యాంకులు కూడా ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో పలువురు వైసీపీ నేతలు వెనుకబడిపోయారు. వారిలో మొదటి నుంచి వైసీపీలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అనుకున్నట్టుగా పాల్గొనకపోతే ఎవరినైనా ఉపేక్షించబోనని వైసీపీ అధినేత వారికి తేల్చిచెప్పారు.

  ఈ విషయంలో తనకు అంతా సమానమే అంటూ.. తనకు సన్నిహితంగా ఉంటూ ఈ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా వైఎస్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే తాజాగా వైఎస్ జగన్ మరోసారి గడప గడపకు వైసీపీ కార్యక్రమం సహా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఏం చెబుతారు ? ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు ? ఎవరికి వార్నింగ్ ఇవ్వబోతున్నారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ సమావేశం పట్ల వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందని కొందరు చర్చించుకుంటున్నారు.

  గతంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన తరువాత చాలామంది వైసీపీ నేతలు దారికొచ్చారని.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొందరు మాత్రం అప్పట్లో అధినేత చెప్పిన మాటలను పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రోజు జరగబోయే సమీక్షలో ఎవరికి ఏ ర్యాంకులు వస్తాయి ? గతంలో జగన్ తక్కువ ర్యాంకులు ఇచ్చిన వారి ర్యాంకులు మెరుగవుతాయా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  CM Jagan: నూతన పరకామణి‌ భవనం ప్రారంభం.. నుదుట తిరునామం, సాంప్రదాయ వస్త్రాలతో కొత్త లుక్కులో సీఎం జగన్..

  YSR Kalyanamastu: కళ్యాణమస్తు పథకం అందాలి అంటే? పది పాస్ అవ్వాల్సిందే..? సీఎం జగన్ క్లారిటీ

  అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కొంతకాలం క్రితం నుంచే కసరత్తు మొదలుపెట్టిన వైఎస్ జగన్.. ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోతే తాను కూడా చేయగలిగింది ఏమీ లేదంటూ కుండబద్ధలు కొట్టారు. అలాంటి వారిని పక్కనపెట్టి మిగతా వారిని ఎంపిక చేసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు తాను ఏ మాత్రం వెనకాడబోనని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ జగన్ సమీక్షలపై వైసీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ కొందరు ఎమ్మెల్యేలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తే.. ఆయా నియోజకవర్గాల్లో ఇతర నేతలకు అది పెద్ద ఆయుధంగా మారుతుందనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు