AP MLC Election 2023: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకప్పుడు అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఎంత అంటే అంత.. ఆయన కనుసైగ చేస్తే.. పార్టీలో ఎక్కడి వారు అక్కడ ఆగాల్సిందే.. ఆయన గీసిన గీత దాటడం అనే ప్రసక్తే ఉండేది కాదు.. అలాంటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. పార్టీకి పూర్తి బలం ఉన్న చోట.. అస్సలు బలం లేని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటును టీడీపీ ఎగురవేసుకుపోయింది. గెలవడం కష్టం అనుకుంటే.. అనూహ్యంగా పంచమర్తి అనురాధ (Panchamarthi Anuradha) 23 ఓట్లతో అందరికి కంటే ముందే విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు మద్దతుగా టీడీపీ నుంచి 19 ఓట్లే ఉంటే.. 23 ఓట్లు పడ్డాయి అంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు..
అందులో రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి ఓట్లు తీసేసినా.. మరో రెండు ఓట్లు పడడం వైసీపీ ఊహించలేకపోయింది. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా అనురాధకు ఓటు వేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టీడీపీ రెబల్స్ నలుగురు, జనసేన రెబల్ ఒక్కరు. ఈ ఐదు ఓట్లు వైసీపీకే పడినట్టు టాక్..
అంటే సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఓటమికి కారణం అవ్వడం వైసీపీ అధిష్టానం జీర్ణించుకోలేక పోతోంది. అనురాధ విజయం ఖాయమవ్వడంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఆయన గెలుపునకు 22 ఓట్లు కావాల్సి ఉండగా, 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయనతో పాటు జయమంగళం కు 21 ఓట్లే వచ్చినా.. రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. ఇక మర్రి రాజశేఖర్, సూర్యనారాయణ రాజు, బొమ్మి ఇజ్రాయిల్, పోతుల సునీత, యేసు రత్నం 22 ఒట్లతో మొదటి ప్రధాన్య ఓట్లద్వారానే నెగ్గారు. వీరందరికి కంటే టీడీపీ అభ్యర్థి అనూరాధ అత్యధికంగా 23 ఓట్లు సొంతం చేసుకున్నారు.
ఇదీ చదవండి : కొత్త ఏడాది పవన్ జాతకం ఎలా ఉంది..? ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతరా..? సీఎం ఛాన్స్ ఉందా..?
అయితే వైసీపీ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం .. అధిష్టానం ముందుచూపు లేకపోవడమే అంటున్నారు. దానికి తోడు ఇంటెలిజన్స్ అధికారుల వైఫల్యం కూడా ఉంది అంటున్నారు. ఎందుకంటే.. గత మూడు రోజులగా పార్టీ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడుతున్నా.. అసమ్మతి నేతలను ఎందుకు పార్టీ పెద్దలు గుర్తించలేకపోయారు అన్నది చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకముందే..? ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు టచ్ లోకి వెళ్లినా.. ఎందుకు ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయిందనే చర్చ జరుగుతోంది. మరి ఈ ఓటమికి ఎలాంటి కారణాలు చెబుతుందో చూడాలి..
ఇదీ చదవండి: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? లోకేష్ భవష్యత్తు ఏంటి..? టీడీపీ పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..?
ఎమ్మెల్సీలకు వచ్చిన ఓట్లు..
పంచమర్తి అనురాధ 23 ఓట్లు
మర్రి రాజశేఖర్ 22 ఓట్లు
సూర్యనారాయణ రాజు 22 ఓట్లు
జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు
కోలా గురువులు 21 ఓట్లు
బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు
పోతుల సునీత 22 ఓట్లు
యేసు రత్నం 22 ఓట్లు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, AP Politics, Ycp