హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం.. సెల్ స్విచ్ ఆఫ్ చేశారంటూ ప్రచారం

Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం.. సెల్ స్విచ్ ఆఫ్ చేశారంటూ ప్రచారం

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

వల్లభనేని వంశీ (పాత ఫొటో)

Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏమైంది.. పది రోజులు అయినా ఆయన ఎందుకు బయటకు రావడం లేదు.. అంతేకాదు ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఓ సంచలన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ విషయాన్ని తన సన్నిహితులకు చెప్పినట్టు టాక్.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాజకీయాల్లో గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsy) కి ప్రత్యేక గుర్తింపు ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయనకు.. గన్నవరంలో తిరుగులేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనే చెప్పాలి.. అంతేకాదు.. ఆయన టీడీపీ తరపున గెలుపొందినా.. ఆ పార్టీ అధినేత సహా కీలక నేతలను తిడుతుంటారు. ఇక ఆ మధ్య టీడీపీకి గుడ్ బై చెప్పి.. జగన్ కు జై కొట్టారు కూడా.. ఇక అప్పటి నుంచి ఆయన అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా..? ఆ పార్టీ నేతలపైనా.. అధినేత పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాంటి వంశీ ఇప్పుడు.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసలు నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయంగా ఎలాంటి పని లేకున్నా.. అనుచరులకు నిత్యం అందుబాటులో ఉండేవారు.. ప్రజల్లో తిరుగుతుండే వారు.. కానీ గత పది రోజుల నుంచి ఆయన ఎవరికీ కనిపించడం లేదు. ఎవరితో మాట్లాడడం లేదని కూడా ఆయన అనుచరులే చెబుతున్నారు. అసలు ఆయన ఈ పది రోజుల నుండి సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ? అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

  ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ అనూహ్యంగా ఘన విజయం సాధించింది. 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. టీడీపీ నుండి గెలిచిన అయిదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టి మద్దతు పలికారు. అందులో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అయితే అంతకుముందు టీడీపీకి బై బై చెప్పిన నేతలు ఎవరూ.. చంద్రబాబుపై పెద్గగా విమర్శలు చేయలేదు.. సైలెంట్ గా టీడీపీకి దూరమయ్యారు.

  కానీ వల్లభనేని వంశీ మాత్రం.. అధినేత చంద్రబాబు నాయుడితో పాటు.. నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ తరుపున గడప గపడకు ప్రభుత్వంతో సహా.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కానీ గత పది రోజుల నుంచి పూర్తిగా సైలెంట్ అయ్యారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేసినప్పటి నుండి కొడాలి నాని , వల్లభనేని వంశీ ఇద్దరిలోనూ అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే వీరద్దరూ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. ఎన్టీఆర్ కు వీరభక్తులు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టే విషయంలో వీరు తీవ్రంగా కృషి చేశారు. సక్సెస్ అయ్యారు. కాకపోతే హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చకుండా ఆపలేకపోయారు. అందుకు వీరిలో కొంత అసంతృప్తి ఉంది. ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వల్లభనేని వంశీ బాధితుడు అవుతారు.

  ఇదీ చదవండి : దసరాకు పూజించే జమ్మి చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న గన్నవరం నియోజకవర్గంలోనే ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరుతో కొంత సెంటిమెంట్ ఉంది.. అంతేకాదు వల్లభనేని వంశీతో సహా ఆయన వర్గీయులు అందరూ దివంగత ఎన్టీఆర్ అభిమానులే.. అయినా అధికార పార్టీలోనే ఉన్నా.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు ఉంచలేకపోయారు అన్న అపవాదు వంశీ మూటగట్టుకోవాల్సి వస్తొంది. అందుకు వల్లభనేని వంశీ ఇటు పార్టీకి చెప్పలేక, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఒప్పించలేక, అటు నియోజకవర్గ ప్రజలకు, తన అభిమానులకు సర్దిచెప్పులేక, ఓటర్ల మనోభావాలు దెబ్బతింటున్నా చూస్తూ ఉండలేక కాస్త సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది.

  ఇదీ చదవండి : 50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టమన్నారు.. కోటి డిమాండ్ చేశారు.. చివరకు బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. ఏం జరిగింది అంటే?

  ఆ విషయం అసలు ఏం మాట్లాడాలో కూడా తేల్చుకోలేకపోతున్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి అయితే ఓ లేఖ రాశారు. పేరు మార్పు అంశంలో పునరాలోచన చేయాలని లేఖలో కోరారు. వంశీ లేఖ రాసిన తర్వాత సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగానే ఎందుకు హెల్త్ యూనివర్శిటీకి పేరు మారుస్తున్నారో వివరణ ఇచ్చారు. బిల్లు కూడా అసెంబ్లీలో పాస్ అయ్యింది. అయినా వంశీ ఆ నిర్ణయాన్ని ఆగేలా చేయలేకపోయారు. దీంతో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన అసంతృప్తి నుండి బయటకు రాలేదు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని

  ఇద్దరు అసెంబ్లీకి హజరు కాలేదు.

  ఇదీ చదవండి : ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోకస్.. ఆయన జాబితాలో ఉన్నది ఎవరు?

  అయితే వంశీ మాత్రం.. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తన అనుచరులకు కూడా అందుబాటులో ఉండడం లేదంటే..? మీడియాకు, సన్నిహితులకు కూడా కనిపించడం లేదంట? అసలు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చిన సమయంలోనే ఆయన సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏంటంటే.. తన సన్నిహితుల వద్ద రాజకీయాల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, ఎన్టీఆర్ సెంటిమెంట్ అధికంగా ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకూ 9 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఏడు సార్లు టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. వల్లభనేని వంశీ కూడా రెండు పర్యాయాలు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి బలమైన గాలి వీచినా వంశీ టీడీపీ తరపున గెలుపొందారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vallabaneni Vamsi

  ఉత్తమ కథలు